iDreamPost

OTTలోకి ‘కోటబొమ్మాళి పీఎస్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Jan 04, 2024 | 8:24 PMUpdated Mar 14, 2024 | 5:07 PM

Movie OTT:ఇటీవలే సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత మెయిన్‌ లీడ్‌లో నటించిన చిత్రం ‘ కోట బొమ్మాళి పీఎస్‌’. అయితే ఈ మూవీ నెల గడవకముందే ఓటీటీలో వస్తుందని వైరల్ అయ్యి మళ్లీ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కోట బొమ్మాళి సినిమా ఓటీటీలోకి రాబోతుందని, డేట్ ని కూడా ఫిక్స్ చేశారట. ఇంతకి అది ఎప్పుడంటే..

Movie OTT:ఇటీవలే సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత మెయిన్‌ లీడ్‌లో నటించిన చిత్రం ‘ కోట బొమ్మాళి పీఎస్‌’. అయితే ఈ మూవీ నెల గడవకముందే ఓటీటీలో వస్తుందని వైరల్ అయ్యి మళ్లీ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కోట బొమ్మాళి సినిమా ఓటీటీలోకి రాబోతుందని, డేట్ ని కూడా ఫిక్స్ చేశారట. ఇంతకి అది ఎప్పుడంటే..

  • Published Jan 04, 2024 | 8:24 PMUpdated Mar 14, 2024 | 5:07 PM
OTTలోకి ‘కోటబొమ్మాళి పీఎస్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు థీయేటర్లలో విడుదలవ్వడమే అలస్యం నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.ఇక ఇదే తరహలో సినీ ప్రియులు కూడా తమ అభిమాన స్టార్స్ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూంటారు. ప్రతివారం ఏదో ఒక కొత్త సినిమా ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత మెయిన్‌ లీడ్‌లో నటించిన చిత్రం ‘ కోట బొమ్మాళి పీఎస్‌’. ఇక ఈ సినిమాలో శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌లు ప్రధాన పాత్రలో నటించారు. కాగా, ఈ మూవీ విడుదల విషయంలో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెల గడవకముందే ఓటీటీలో వస్తుందనే వార్త వైరల్ గా మారింది. అనుకున్నట్టుగానే తేదిని కూడా ఖరారు చేసిన ఎందుకో అది కూడా వాయిదా పడింది. అయితే మళ్లీ ఇప్పుడు కోట బొమ్మాళి సినిమా ఓటీటీలోకి రాబోతుందని డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇంతకి అది ఎప్పుడంటే..

ఎంతో ఇంట్రెస్టింగ్ తో తెరకెక్కిన కోట బొమ్మాళి సినిమా థియేటర్స్ లో బాగానే ఆకట్టుకుంది. ఇక కలెక్షన్ల పరంగా కూడా సినిమా పర్వాలేదు అనిపించింది. కాగా, ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ కోటబొమ్మాళి పీఎస్ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. తాజాగా ఈ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. దీనిని సంక్రాంతి కానుకగా ఆహాలో జనవరి 12న స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ కోట బొమ్మాళి సినిమాలో ‘లింగిడి’అనే పాటతో మూవీకి మంచి ప్రమోషన్‌ లభించింది. ఈ పాట ద్వారా సినిమా పై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మొదటి రోజు నుంచి జనాలు మూవీకి క్యూ కట్టారు. అలాగే ప్రక్షకుల నుంచి కోట బొమ్మాళి పీఎస్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా, ఇది మలయాళ సినిమా ‘నాయట్టు’కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ మూవీ మలయాళంలో మంచి విజయాన్ని సాధించడంతో దర్శకుడు తేజమణి తెలుగులోకి రీమేక్‌ చేశారు.

ఈ మూవీకి నిర్మాతగా బన్నీ వాసు, విద్యా కొప్పినీడి వ్యవహరించాగా, రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్‌లు సంగీతాన్ని అందించారు. అయితే, దర్శకుడు తేజమణి మాత్రం తెలుగులో కొన్ని మార్పులు చేశాడు. సినిమాలో పోలీసుల్ని రాజకీయనాయకులు ఎలా వాడుకుంటారు? ఓట్ల కోసం కుల, మతాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనే.. దాని గురించి ఈ సినిమా లో చూపించారు. ఇందులో ప్రధాన పాత్రలు చేసిన శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, మురళీ శర్మలు పోటాపోటీగా నటించారు. శ్రీకాంత్‌ నటన సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. థీయేటర్లలో మంచి స్పందన లభించిన కోటబొమ్మాళి పీఎస్ ఇప్పుడు ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుంది అన్నది చూడాలి. మరి, కోటబొమ్మాళి సినిమా ఓటీటీలో రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి