iDreamPost

Bichagadu 2 OTT Release Date: OTTలోకి బిచ్చగాడు 2.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పటి నుంచి అంటే?

  • Author Soma Sekhar Updated - 11:35 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:35 PM, Thu - 2 November 23
Bichagadu 2 OTT Release Date: OTTలోకి బిచ్చగాడు 2.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పటి నుంచి అంటే?

బిచ్చగాడు.. విజయ్ ఆంటోని నటించి, దర్శకత్వం వహించిన సినిమా. 2016లో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా అంతే విజయాన్ని సాధించింది. తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది ఈ మూవీ. సీక్వెల్ కు కూడా విజయ్ ఆంటోనియే దర్శకత్వం వహించాడు. అయితే థియేటర్లలో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు బిచ్చగాడు 2 ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వారు ఎదురుచూపులకు తెరదించుతు స్ట్రీమింగ్ సంస్థ అఫీషియల్ డేట్ ను అనౌన్స్ చేసింది.

బిచ్చగాడు 2.. విజయ్ ఆంటోని, కావ్యాథాపర్ లు కలిసి జంటగా నటించిన సినిమా. ఈ సినిమాకు దర్శకత్వం, మ్యూజిక్ డైరెక్టర్ కూడా విజయ్ ఆంటోనియే కావడం విశేషం. ఇటీవల విడుదల అయిన బిచ్చగాడు 2 ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ చురగొన్నది. మంచి వసూళ్లతో పాటుగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి వస్తోంది.

ఈ క్రమంలోనే తొలుత బిచ్చగాడు 2 జూన్ 17 లేదా 23న ఓటీటీలోకి వస్తుందని అందరు భావించారు. అయితే ఈ సస్సెన్స్ కు తెరదించుతూ.. స్ట్రీమింగ్ సంస్థ అఫీషియల్ డేట్ ను అనౌన్స్ చేసింది. కాగా ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ మీడియా డిస్ని ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. జూన్ 18 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది అని ప్రకటించింది. తెలుగు, తమిళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి