iDreamPost
android-app
ios-app

కేంద్ర మంత్రి ఇంట్లో యువకుడి దారుణ హత్య!

  • Published Sep 01, 2023 | 12:16 PM Updated Updated Sep 01, 2023 | 12:16 PM
  • Published Sep 01, 2023 | 12:16 PMUpdated Sep 01, 2023 | 12:16 PM
కేంద్ర మంత్రి ఇంట్లో యువకుడి దారుణ హత్య!

కేంద్ర మంత్రి కౌశల్‌ కిషోర్‌ ఇంట్లో దారుణం చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. తుపాకితో ఎవరో అతడ్ని కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేంద్ర మంత్రి ఇంటికి చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంనుంచి ఓ లైసెన్స్‌ ఉన్న తుపాకిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఆ తుపాకి కేంద్ర మంత్రి కౌశల్‌ కిషోర్‌ కుమారుడు వికాశ్‌ కిషోర్‌దిగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి ఇంట్లో హత్యకు గురైన యువకుడ్ని వినయ్‌ శ్రీవాస్తవగా గుర్తించారు.

అతడిది ఠాకూర్‌ఘంగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బెగారియా గ్రామంగా తేలియవచ్చింది. ఇక, ఈ సంఘటనపై కౌశల్‌ కిషోర్‌ మాట్లాడుతూ..‘‘ ఈ కేసుకు సంబంధించి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఫోరెన్సిక్‌ టీం, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని వదిలిపెట్టేది లేదు. మృతుడి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాను. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు ఉన్నారో నాకు తెలీదు’’ అని అన్నారు.

కాగా, ఈ హత్యలో​ కేంద్ర మంత్రి కుమారుడు వికాశ్‌ కిషోర్‌ హస్తం ఉన్నట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. పోలీసులు ఇప్పటికే ముగ్గురు అనుమానితుల్ని గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇక, పోలీసులు సీసీటీవీ కెమెరా దృశ్యాలను సైతం శోధిస్తున్నారు. మరి, ఈ హత్యకు కేంద్ర మంత్రి కుమారుడికి సంబంధం ఉందని తేలితే ఏమవుతుందో వేచి చూడాల్సిందే.. మరి, కేంద్ర మంత్రి కౌశల్‌ కిషోర్‌ ఇంట్లో ఓ యువకుడు దారుణంగా హత్యకు గురవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibombetcio girişiptv satın al