iDreamPost

అజిత్ భార్య.. నటి షాలిని షాకింగ్ పోస్ట్! ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తూ!

  • Published Jun 05, 2024 | 4:21 PMUpdated Jun 05, 2024 | 4:21 PM

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఓ వ్యక్తి మోసం చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ విషయం పై స్పందించిన షాలిని దీనిపై హెచ్చరిస్తూ ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఓ వ్యక్తి మోసం చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ విషయం పై స్పందించిన షాలిని దీనిపై హెచ్చరిస్తూ ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

  • Published Jun 05, 2024 | 4:21 PMUpdated Jun 05, 2024 | 4:21 PM
అజిత్ భార్య.. నటి షాలిని షాకింగ్ పోస్ట్!  ఫ్యాన్స్ కి వార్నింగ్  ఇస్తూ!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ పేరు మీద మోసాలు అనేవి రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా వారి పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కొంతమంది అమాయకులను మబ్బి పెడుతున్నారు. ఈ క్రమంలోనే.. మొదట ఆ సెలబ్రిటీస్ కు సంబంధించి రకరకాల ఫోటోలను, అప్ డేట్ లను పోస్ట్ చేస్తూ భారీ ఫాలోవర్స్ ను పెంచుకుంటారు. అంతేకాకుండా.. కొత్తగా వారి పేరిట సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నమని డబ్బులు అడగటం వంటివి చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్  చేయడం, వారి పేరిట ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడం వంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజాగా మరో స్టార్ హీరో భార్య  పేరిట కూడా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి మోసం చేస్తూ.. వేలాది మంది ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక ఈ విషయం పై స్పందించిన హీరో భార్య ఓ పోస్ట్ పెట్టడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకి ఆమె ఎవరంటే..

కోలీవుడ్ లో బాలనటిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరోయిన్ ‘షాలిని’ కూడా ఒకరు. ఈమె ఇండస్ట్రీలో రజనికాంత్ తో సహా పలువురు ప్రముఖ నటుల సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ క్రమంలోనే షాలిని ఇటు తమిళ్ తో పాటు మలయాళ, తెలుగు, కన్నడ వంటి  దక్షిణాది భాషల్లో కూడా బాలనటిగా అలరించింది. ఇక ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. అయితే మొదటిగా షాలిని  మలయాళంలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాసిల్ దర్శకత్వం వహించగా తమిళంలో దళపతి విజయ్ సరసన షాలిని మినీ పాత్రను పోషించింది. అప్పుడు ఆమెకు భారీ ఆదరణ లభించింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన షాలిని ఆ తర్వాత అజిత్ సరసన అమర్కలం, మాధవన్ సరసన అలైపాయుతే, ప్రశాంత్‌తో ప్రియతవరం వాలా వంటి కొన్ని సినిమాలతో హిట్ కొట్టింది.

ఇలా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇక పెళ్యయ్యాక సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన షాలిని ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో కూడా పూర్తిగా కనిపించడం లేదు. కానీ, గత రెండేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించి దాని ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే షాలిని పేరిట ఓ వ్యక్తి నకిలీ ఎక్స్ ఖాతాను సృష్టించి అందర్ని మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ఇప్పటి వరకు దాదాపు 80.1K మంది ఫాలోవర్లను పెంచుకున్నాడు. ఇక ఈ విషయం షాలిని దృష్టికి వెళ్లడంతో ఆమె దానిపై  తాజాగా స్పందించి ఓ పోస్ట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే తన ఇన్ స్టా గ్రామ్ పేజిలో ఫేక్ ఎక్స్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి ఇది నా అఫిషియల్ ఎక్స్ ఖాతా కాదని, దయచేసి ఈ ఖాతాను ఎవరు ఫాలో చేయవద్దని ఫ్యాన్స్ ను హెచ్చరించింది. మరి, అజిత్ భార్య షాలిన్ పేరు మీద ఫేక్ ఎక్స్ ఖాతా వైరల్ అవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి