iDreamPost

కళాభవన్ మణి.. పేదరికం గురించి ఎవరికి తెలియని నిజాలు

  • Published Mar 21, 2024 | 5:29 PMUpdated Mar 21, 2024 | 5:29 PM

ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి గురించి తెలుగు ప్రేక్షకులు అందరికి తెలిసిందే. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించిన ఈయన గత కొన్ని సంవత్సరాల క్రితం రక్తం కక్కుకొని మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన గురించి ఎవ్వరికి తెలియని కొన్ని నిజాలు తమిళ నటుడు సురేష్ గోపి బయటపెట్టారు.

ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి గురించి తెలుగు ప్రేక్షకులు అందరికి తెలిసిందే. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించిన ఈయన గత కొన్ని సంవత్సరాల క్రితం రక్తం కక్కుకొని మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన గురించి ఎవ్వరికి తెలియని కొన్ని నిజాలు తమిళ నటుడు సురేష్ గోపి బయటపెట్టారు.

  • Published Mar 21, 2024 | 5:29 PMUpdated Mar 21, 2024 | 5:29 PM
కళాభవన్ మణి.. పేదరికం గురించి ఎవరికి తెలియని నిజాలు

‘కళాభవన్ మణి’.. ఈ మలయాళ నటుడు తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. ఎందుకంటే ఈయన తెలుగులో ‘జెమిని’, ‘ఆయుధం’, ‘నరసింహుడు’, ‘నగరం’ వంటి తదితర చిత్రాల్లో విలాన్ గా నటించి మెప్పించాడు. అంతేకాకుండా.. తెలుగుతో పాట, మలయాళ, తమిళ్ కన్నడ వంటి భాషల్లో అనేక సినిమాలు చేశాడు. అంతేకాకుండా ప్లే బ్లాక్ సింగర్ గానూ తన టాలెంట్ ను చూపించాడు నటుడు మణి. ఈ క్రమంలోనే ఈయన మలయాళ చిత్రపరిశ్రమలో తొలిసారి జాతీయ అవార్డు కూడా అందుకొని తన సత్తా చాటించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో విభన్న పాత్రలు పోషించిన మణి 2016లో రక్తం కక్కుకుని మరణించాడు. అయితే అతని మరణానికి కారణం.. డిప్రెషన్‌తో బాధపడుతూ అతిగా మద్యం తాగడం వల్లే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, ఫోరెన్సిక్‌ టెస్ట్‌లో ద పురుగుల మందు ఆనవాళ్లు కూడా లభించడంతో అప్పట్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గోన్న తమిళ్ నటుడు సురేష్ గోపి.. కళాభవన్ మణి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

కోలీవుడ్ నటుడు సురేష్ గోపి ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మలయాళ నటుడు కళాభవన్ మణితో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక మణి గురించి సురేష్ గోపి మాట్లాడుతూ.. ‘మణిపై ఎప్పటికీ నా ప్రేమ మారదు. ఫస్ట్‌ టైం మణిని చూడగానే నచ్చేశాడు. ఇప్పటికీ తనపై నాకు ఆ ప్రేమ, అభిమానం అలాగే ఉంది. అతడి పేరు ఎత్తగానే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి అరేబియన్‌ డ్రీమ్స్‌ అని ఓ షో కోసం మేమంతా దుబాయ్‌ వెళ్లాము. అక్కడ నా గది పెద్దదిగా ఉంటుంది. అందులో మేమంతా కలిసి ఒకే గదిలో కింద కార్పెట్‌ వేసుకుని నిద్రించాము.అది నాకు ఇప్పటికి మర్చిపోలేని జ్ఞాపకం. ఇంకోటి.. అతడి పెళ్లి రోజు నన్ను చూడగానే మణి సంతోషంతో ఏడ్చేశాడు. ఎందుకంటే.. తన పెళ్లికి ఎవరూ రాలేదని, నేనొక్కడినైనా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందంటూ నన్ను హత్తుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే నా మనసు భావోద్వేగానికి లోనవుతుంది’ అని చెప్పుకొచ్చాడు’. ప్రస్తుతం తమిళ నటుడు సురేష్ గోపి.. కలాభవన్ మణి గురించి ఎవరికి తెలియని నిజాలు, ఆయనతో ఉన్న అనుబంధం పై పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, సినిమాల్లో విలన్ పాత్రల్లో అలరించిన నటుడు కళాభవన్ మణి గురించి తెలిసిన ఆసక్తికర విషయాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి