iDreamPost

వెరైటీ వెడ్డింగ్‌.. రోడ్డుకు పెళ్లి చేసిన గ్రామస్తులు.. కారణమిదే

  • Published Feb 27, 2024 | 10:35 AMUpdated Feb 27, 2024 | 10:35 AM

సాధారణంగా మనుషులతో పాటు జంతువులకు కూడా పెళ్లిళ్లు జరిపించడం చాాలా వరకు వినే ఉంటాం. కానీ ఓ గ్రామస్తులు మాత్రం కాస్త కొత్తగా ఎప్పుడు చూడని, వినని పద్ధతిలో వివాహ తంతును జరిపించారు. ఈ వెరైటీ వెడ్డింగ్ ను చూసి అందరూ అవాక్కయ్యారు.

సాధారణంగా మనుషులతో పాటు జంతువులకు కూడా పెళ్లిళ్లు జరిపించడం చాాలా వరకు వినే ఉంటాం. కానీ ఓ గ్రామస్తులు మాత్రం కాస్త కొత్తగా ఎప్పుడు చూడని, వినని పద్ధతిలో వివాహ తంతును జరిపించారు. ఈ వెరైటీ వెడ్డింగ్ ను చూసి అందరూ అవాక్కయ్యారు.

  • Published Feb 27, 2024 | 10:35 AMUpdated Feb 27, 2024 | 10:35 AM
వెరైటీ వెడ్డింగ్‌.. రోడ్డుకు పెళ్లి చేసిన గ్రామస్తులు.. కారణమిదే

ప్రస్తుతం సోషల్ మీడియా అనేది అందుబాటులో ఉండటంతో ప్రపంచ నలుమూలాల ఏం జరిగిన ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ లేని వింతలు విడ్డురాలు సామాజిక మాధ్యమంలో దర్శనమిస్తుంటాయి. అయితే, ఈ మధ్యాకాలంలో ఎక్కువగా వివాహా వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. చాలామంది తమ వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే చాలామంది విన్నూతంగా ఆలోచించి సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలుస్తుంటారు. అయితే తాజాగా ఓ గ్రామంలో జరిగే వివాహా వేడుక మాత్రం అంతకు మించేలా ఉంటుంది. మనం ఇంత వరకు ఎక్కడ చూడని, వినని పద్ధతిలో ఈ వివాహ వేడుకలను ఆ గ్రామస్థులు ఘనంగా జరిపించారు.

సాధారణంగా మనుషులకు జరిగే పెళ్లిళ్లే కాకుండా.. కుక్కలు, గాడిదలు వంటి జంతువులకు కూడా పెళ్లిళ్లు జరిపించడం చాలా వరకు వినేం ఉంటాం. కానీ, ఓ గ్రామస్థులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహారించారు. మనుషులకు, జంతువులకు మినహాయించి ఏకంగా రోడ్డుకు ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక ఈ పెళ్లికి అతిథులను ఆహ్వానించి వారికి చక్కని విందును కూడా ఏర్పాటుచేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఈ ఘటన కేరళలోని కోజికోడ్ సమీపంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లా కొడియత్తూరు గ్రామస్థులు రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల కోసం ఈ కార్యక్రమాన్ని జరిపించరట. అయితే, ఈ పెళ్లికి వధువరులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. కేవలం నిధులు సమకూర్చడం కోసం ఈ రోడ్డకు పెళ్లి పేరుతో కార్యక్రమం నిర్వహించారు.

అయితే, కొడియాత్తూరులో 1980లో ఈ రోడ్డును 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పుతో నిర్మించారు. కానీ అప్పటితో పోల్చితే ఇప్పుడు గ్రామంలో జనాభా మూడు రెట్లు పెరిగింది. దీంతో వాహన రాకపోకలు భారీగా పెరిగి గ్రామస్థులు బాగా ఇబ్బంది పడుతున్నారు. పైగా రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో మరమ్మతులు చేసి, రోడ్డు విస్తరణ చేయడం కోసం గ్రామస్థులు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, కొన్ని కారణాల వలన ఆ పనులు మొదలుకాలేదు.ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొందరు భూమిని కోల్పోతారని గుర్తించారు.

కాగా, అలాంటి వారికి పరిహారం, రహదారి నిర్మాణానికి రూ.60 లక్షలు అవుతుందని అంచనా వేసి, ఈ నిధుల కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే.. గ్రామానికి చెందిన 15 మంది ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున విరాళం అందజేశారు. కానీ, మరో రూ.45 లక్షలు అవసరం కావడంతో.. అప్పుడే వారికి ‘పనం పయట్టు’, కురికళ్యాణం గుర్తుకొచ్చింది. ఇది ఉత్తర కేరళలో సంప్రదాయ దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ. ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి నిధులను పోగు చేస్తారు. ఇది 90వ దశకంలో రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల ప్రాముఖ్యత కోల్పోయిన సంప్రదాయాన్ని, మళ్లీ ఇప్పుడు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు నిధుల కోసం ఈ గ్రామస్థులు తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే పనం పయట్టు కింద రహదారికి పెళ్లిచేశారు. మరి, విడ్డూరంగా రోడ్డుకు పెళ్లి చేసి నిధులు సేకరించే ఆ గ్రామస్థుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి