iDreamPost

KL రాహుల్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఈమె నాన్న కూడా ఓ స్టార్!

  • Published Apr 10, 2024 | 4:25 PMUpdated Apr 10, 2024 | 4:25 PM

కేఎల్ రాహుల్ చేతిలోని ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఆమె తండ్రి కూడా ఓ స్టార్ క్రికెటర్. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

కేఎల్ రాహుల్ చేతిలోని ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఆమె తండ్రి కూడా ఓ స్టార్ క్రికెటర్. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 10, 2024 | 4:25 PMUpdated Apr 10, 2024 | 4:25 PM
KL రాహుల్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఈమె నాన్న కూడా ఓ స్టార్!

లక్నో సూపర్ జియాంట్స్ జట్టు ఈసారి మంచి దూకుడు మీద ఉంది. మొదటి మ్యాచ్​లో ఓటమి నుంచి వెంటనే తేరుకున్న ఆ టీమ్.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ జట్టు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ అద్భుతంగా రాణిస్తోంది. అందుకే వరుసగా విజయాలు దక్కుతున్నాయి. గాయం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్​లో రాణించడమే గాక.. కెప్టెన్​గానూ టీమ్​ను సక్సెస్​ఫుల్​గా ముందుండి నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్​కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. ఓ చిన్నారిని ఎత్తుకొని అతడు దిగిన ఫొటోను చూసిన వారంతా షాక​వుతున్నారు. రాహుల్-అతియా జంటకు కుమార్తె ఎప్పుడు పుట్టిందని ఆశ్చర్యపోతున్నారు. అయితే రాహుల్ చేతిలోని ఆ పాపాయి వాళ్ల కుమార్తె కాదు.

రాహుల్ ఎత్తుకున్న ఈ బాలిక్ మరెవరో కాదు.. సౌతాఫ్రికా దిగ్గజ ఓపెనర్ క్వింటన్ డికాక్ గారాలపట్టి. తన పేరు కియారా. టీమిండియాతో మ్యాచులు అంటే చెలరేగి ఆడే డికాక్.. ఐపీఎల్​లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముంబై ఇండియన్స్​కు ఆడుతూ రెండుసార్లు కప్ విన్నింగ్ టీమ్​లో భాగమయ్యాడు. ఆ రెండుసార్లూ టీమ్ గెలుపులో అతడి కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. 2013 నుంచి ఐపీఎల్​లో ఆడుతూ వస్తున్నాడు డికాక్. ఇప్పటిదాకా 100 మ్యాచ్​లు ఆడిన ఈ వికెట్ కీపర్, బ్యాటర్ 32.47 యావరేజ్​తో 3,052 పరుగులు చేశాడు. 2 సెంచరీలు సహా 22 హాఫ్ సెంచరీలు బాదాడతను. ముంబైతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా ఆడాడు డికాక్.

ఈ సీజన్​కు ముందు జరిగిన మినీ ఆక్షన్​లో లక్నో సూపర్ జియాంట్స్ డికాక్​ను కొనుక్కుంది. రూ.6.75 కోట్లు చెల్లించి అతడ్ని దక్కించుకుంది. ఇద్దరూ ఒకే టీమ్​కు ఆడుతుండటంతో ఈ స్టార్ ఓపెనర్ కూతుర్ని సరదాగా ఎత్తుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు రాహుల్. కియారాతో కేఎల్ దిగిన ఫొటోలను చూసిన నెటిజన్స్ మొదట రాహుల్​కు పాపాయి ఏంటని షాకయ్యారు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసి రియాక్ట్ అవుతున్నారు. డికాక్ డాటర్ చాలా క్యూట్​గా ఉందని అంటున్నారు. కాగా, డికాక్ భార్య పేరు సాషా హర్లీ. 16 ఏళ్లకే ఈ బ్యూటీని ప్రేమలో పడేశాడతను. ఐదు సంవత్సరాల డేటింగ్ తర్వాత ఈ జంట 2016, సెప్టెంబర్​లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్లకు 2022, జనవరిలో కియారా జన్మించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి