iDreamPost
android-app
ios-app

IPL 2024: KKR vs MI మ్యాచ్ లో చెత్త రికార్డ్.. ఈ సీజన్ లో ఇదే తొలిసారి!

  • Published May 04, 2024 | 7:38 AM Updated Updated May 04, 2024 | 7:38 AM

కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఓ చెత్త ఫీట్ క్రియేట్ అయింది. ఇలా జరగడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతకీ ఆ చెత్త ఫీట్ ఏంటంటే?

కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఓ చెత్త ఫీట్ క్రియేట్ అయింది. ఇలా జరగడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతకీ ఆ చెత్త ఫీట్ ఏంటంటే?

IPL 2024: KKR vs MI మ్యాచ్ లో చెత్త రికార్డ్.. ఈ సీజన్ లో ఇదే తొలిసారి!

ఐపీఎల్ 2024 సీజన్ సరికొత్త చరిత్రలకు శ్రీకారం చూడుతూ ముందుకుసాగుతోంది. ఇక ఈ సీజన్ లో నమోదైయ్యే రికార్డులకు లెక్కేలేకుండా పోతుంది. కొన్ని అద్భుతమైన ఘనతలు అయితే.. మరికొన్ని వరస్ట్ రికార్డులు కూడా క్రియేట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా జరిగిన కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఓ చెత్త ఫీట్ క్రియేట్ అయింది. ఇలా జరగడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతకీ ఆ చెత్త ఫీట్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం(మే 3) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా టీమ్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అసలు కేకేఆర్ ఇన్ని రన్స్ చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే? ఆ టీమ్ 57 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి టైమ్ లో వెంకటేశ్ అయ్యర్(70), మనిష్ పాండే(42) పరుగులతో రాణించారు. దాంతో కేకేఆర్ ఓ మోస్తారు స్కోర్ ను సాధించింది. ముంబై బౌలర్లలో బుమ్రా, తుషారా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 170 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 18.5 ఓవర్లలో 145 రన్స్ కే ఆలౌట్ అయ్యి.. 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. సూర్యకుమార్(56) ఒక్కడే అర్దశతకంతో రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ ఓ చెత్త ఫీట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అదేంటంటే? ఈ ఐపీఎల్ సీజన్ లో ఇరు జట్లు ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. దాంతో ఈ సీజన్ లో రెండు టీమ్స్ ఆలౌట్ అయిన మ్యాచ్ గా చెత్త రికార్డును మూటగట్టుకుంది. కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఇలా కేవలం నాలుగు సార్లు మాత్రమే జరిగింది. 2010 సీజన్ లో DC vs RR, 2017 KKR vs RCB, 2018లో MI vs SRH మ్యాచ్ ల్లో రెండు జట్లు ఆలౌట్ అయ్యాయి. మరి ఈ చెత్త రికార్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.