iDreamPost

కిమ్ ఆరోగ్యం బాగుండాలి – ట్రంప్

కిమ్ ఆరోగ్యం బాగుండాలి – ట్రంప్

ఒకప్పుడు ఢీ అంటే ఢీ అన్నట్లు ఉండేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ల వ్యవహారం. కానీ వీరిద్దరి దూకుడు శైలివల్ల అణుయుద్దం తప్పదేమో అనేంత ఉద్రిక్త గతంలో పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత కాలం తర్వాత ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. తాజాగా ఉత్తర కొరియా సుప్రీ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను బట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు.

కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వస్తున్నాయని ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో వ్యాఖ్యానించారు. కిమ్ తో తనకి మంచి సంబంధాలు ఉన్నాయని,ఆయన బాగుండాలని ఆశిస్తున్నానని వెల్లడించారు. పత్రికా కథనాల ద్వారా వచ్చిన వార్తలు ఆధారంగానే తాను కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతున్నానని ఆయన క్షేమంగా ఉండాలని భావిస్తున్నానని ట్రంప్ తెలిపారు.

కిమ్ జోంగ్ ఉన్ ఊబకాయంతో బాధపడుతున్నారని,చైన్ స్మోకింగ్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారని, గుండె ఆపరేషన్ జరిగిందని, బ్రెయిన్ డెడ్ అయ్యారని పత్రికల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.అత్యంత ఘనంగా నిర్వహించే తాత గారి జన్మదిన వేడుకల్లో కిమ్ పాల్గొనకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది.

ఇప్పటికే కిమ్ మరణించారని ఆయన తర్వాత ఉత్తర కొరియాను నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారని డిబేట్లు కూడా నడుస్తున్నాయి. కాగా దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం కిమ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనడానికి తగిన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. కాగా కిమ్ ఆరోగ్యంపై వస్తున్న ఈ వార్తలను కట్టిపెట్టడానికి ఉత్తర కొరియా ప్రభుత్వం స్పందిస్తే తప్ప కిమ్ జోంగ్ ఉన్ కి ఏం జరిగిందో అన్నది తెలిసే పరిస్థితి లేదు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి