iDreamPost

KGF 2 20 రోజుల కలెక్షన్స్

KGF 2 20 రోజుల కలెక్షన్స్

నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న కెజిఎఫ్ 2 స్పీడ్ పూర్తిగా తగ్గలేదు. నిన్నటి నుంచి అనూహ్యంగా మళ్ళీ పుంజుకున్నాయి. రంజాన్ మాసం పూర్తి కావడంతో కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నలభై రోజులు పూర్తి చేసుకోవడం, ఆచార్య కనీస స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోవడం లాంటి కారణాలు దీనికి దోహదపడుతున్నాయి. నార్త్ లో ఒక్క హిందీ వెర్షనే నాలుగు వందల కోట్ల గ్రాస్ కు దగ్గర కావడం ట్రేడ్ ని విస్మయపరుస్తోంది. దంగల్ పేరిట ఉన్న టాప్ 1 రికార్డుని ఈజీగా దాటేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల టార్గెట్ ని పూర్తి చేసుకున్న కెజిఎఫ్ 2 ఎంతలేదన్నా ఇంకో పది రోజులు మంచి రన్ దక్కించుకుంటుంది.

అసలు బాష కర్ణాటక కంటే మిగిలిన చోట్లే కెజిఎఫ్ 2 బెటర్ గా ఉండటం విచిత్రం. దీన్ని బట్టే శాండల్ వుడ్ కంటే బయట మార్కెట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం నైజామ్ నుంచే 40 కోట్లు రాబట్టిన రాఖీ భాయ్ వీక్ డేస్ లోనూ మంచి ఫిగర్స్ నమోదు చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 27 స్ట్రీమింగ్ జరుగుతుందని ప్రచారం అవుతోంది కానీ నిజమో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు. ఒకవేళ నిజమైనా కాకపోయినా అప్పటికంత ఫైనల్ రన్ పూర్తవుతుంది. బాహుబలి తర్వాత ఒక్క కెజిఎఫ్ మాత్రమే సీక్వెల్ సెంటిమెంట్ బ్రేక్ చేసి మొదటి భాగం కంటే ఎక్కువ విజయాన్ని సాధించింది.

నైజామ్ – 41 కోట్ల 35 లక్షలు
సీడెడ్ – 11 కోట్ల 31 లక్షలు
ఉత్తరాంధ్ర – 7 కోట్ల 43 లక్షలు
ఈస్ట్ గోదావరి – 5 కోట్ల 46 లక్షలు
వెస్ట్ గోదావరి – 3 కోట్ల 44 లక్షలు
గుంటూరు – 4 కోట్ల 56 లక్షలు
కృష్ణా – 4 కోట్లు
నెల్లూరు – 2 కోట్ల 65 లక్షలు

ఏపి తెలంగాణ 20 రోజుల షేర్ – 80 కోట్ల 20 లక్షలు

కర్ణాటక – 95 కోట్ల 90 లక్షలు
తమిళనాడు – 45 కోట్ల 60 లక్షలు
కేరళ – 28 కోట్ల 5 లక్షలు
హిందీ వెర్షన్ – 195 కోట్లు
ఓవర్సీస్ – 86 కోట్ల 65 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల టోటల్ షేర్ – 531 కోట్ల 80 లక్షలు

గ్రాస్ లెక్కలో చూసుకుంటే ఈ మొత్తం సుమారు వెయ్యి కోట్ల డెబ్భై ఏడు లక్షల దాకా తేలుతుంది. ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్ కాదు కానీ ట్రేడ్ లో ఈ లెక్కలే చర్చలో ఉన్నాయి. థియేట్రికల్ బిజినెస్ కు రెట్టింపు లాభాలు అందుకున్న కెజిఎఫ్ మూడో భాగం వస్తుందనే ప్రచారం జరుగుతోంది కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దానికి సంబంధించి ఎలాంటి క్లూస్ ఇవ్వడం లేదు. అటు హీరో యష్ ఇంకా కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ ప్రాజెక్టు ఏది ఉంటుందనే ఊహాగానాలు జోరుగా ఉన్నాయి కానీ ఫలానా కాంబోలో ఉండొచ్చనే లీకులు బయటికి రావడం లేదు. మొత్తానికి రాఖీ భాయ్ అరాచకం మాములుగా లేదుగా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి