iDreamPost

శబరిమల ఏర్పాట్లపై విమర్శలు.. ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు!

దేశంలో ప్రసిద్ద పుణ్య క్షేత్రాల్లో ఒకటి శబరిమల. ఇక్కడ అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. ప్రతి ఏటా లక్షల్లో అయ్యప్ప భక్తులు స్వామి వారి దర్శనం కోసం తరలివస్తుంటారు.

దేశంలో ప్రసిద్ద పుణ్య క్షేత్రాల్లో ఒకటి శబరిమల. ఇక్కడ అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. ప్రతి ఏటా లక్షల్లో అయ్యప్ప భక్తులు స్వామి వారి దర్శనం కోసం తరలివస్తుంటారు.

శబరిమల ఏర్పాట్లపై విమర్శలు.. ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు!

ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు శమరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప శరణ ఘోష ఒకవైపు.. భక్తలు అరిగోస మరోవైపు అన్న చందంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల తాడికి బాగా పెరిగిపోయింది. స్వామి వారి దర్శనం కోసం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దాదాపు రోజుకి 90 వేల నుంచి లక్షకు పైగా భక్తులు రావడంతో స్వామి వారి దర్శనానికి ఏకంగా 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులు క్యూ లైన్లలో నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు.  స్వామి వారి దర్శనం కోసం తరలి వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పిస్తారు.. కానీ ఇక్కడ ఆ పరిస్థితి సరిగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి శబరిమల. కేరళా రాష్ట్రంలో ఉన్న శబరిమలకు ప్రతి యేటా లక్షల్లో భక్తులు తరలి వెళ్తుంటారు. స్వామి వారి దర్శనం కోసం శబరిమలకు భక్తుల తాకిడి పెరిగిపోవడంతో అయ్యప్ప స్వామి దర్శనం వేళలు గంట పొడిగిస్తూ.. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గత ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన వేళలు పెంచింది. ఇదిలా ఉంటే.. దర్శనం కోసం వస్తున్న భక్తుల కోసం కేరళా ప్రభుత్వం మౌళిక వసతుల ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత శుక్రవారం ఓ 11 ఏళ్ల బాలిక క్యూలైన్లో నిలబడి సొమ్మసిల్ల పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ ఆ బాలికను ఆస్పత్రికి తరలించగా శనివారం కన్నుమూసింది. క్యూ లైన్లలో గంటల కొద్ది భక్తులు నిలబడటంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొంతమంది అయ్యప్ప దర్శనం కాకుండానే భక్తులు తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నారని భక్తులు, వామపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి.

ఈ ఏడాది అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండకింద పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్లో బాగా రద్ది పెరిగిపోయింది. ఘాట్ రోడ్లలో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. అక్కడి ప్రాంతం అంతా స్వామి శరణు ఘోషతో మార్మొగుతుంది. స్వామి వారి దర్శనం కోసం కలిసి వచ్చిన వాళ్లు తప్పిపోతున్నారు.. తమ వారి కోసం వెతికేందుకు గంటల సమయం పడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ బాల స్వామికి సంబంధించిన వీడియో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. బాలస్వామి తన తండ్రితో కలిసి మాలధారణ చేశాడు. స్వామి వారి  దర్శనానికి శబరిమల వచ్చాడు.. అప్పటి వరకు తండ్రి చేయి పట్టుకొని స్వామి వారి సన్నిదానికి వెళ్తున్న ఆ బాలస్వామి అనుకోకుండా తండ్రి నుంచి దూరమయ్యాడు. అంతే లక్షల మందిలో తన తండ్రి జాడ ఎక్కడ తెలియక తల్లిడిల్లిపోయాడు.

బస్సులో అప్పా.. అప్పా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా పిలుస్తున్నాడు.. ఆ బాల స్వామి పడుతున్న ఆవేదన చూసిన వారంత కన్నీరు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఓ పోలీస్ వచ్చి తండ్రిని వెతుకుతామని చెప్పి వివరాలు తీసుకున్నారు. అయినా కూడా ఆ బాలస్వామి ఆవేదన చెందుతూనే ఉన్నాడు. ఇలా ఒక్క బాలస్వామి మాత్రమే కాదు.. లక్షల మంది భక్తుల్లో తమ వారు కనిపించకుండా పోవడంతో చాలా మంది కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు దృష్టిలో పెట్టుకొని భక్తులకు సరైన వసతీ ఏర్పాటు, పోలీస్ రక్షణ, తప్పిపోయిన వారిని వెతికి పెట్టడానికి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం బాల స్వామికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి