iDreamPost

కీర్తి సురేష్ – తమన్నాలతో మల్టీస్టారర్! తెలుగు డైరెక్టర్ మాస్టర్ ప్లాన్?

  • Author ajaykrishna Updated - 10:51 AM, Fri - 4 August 23
  • Author ajaykrishna Updated - 10:51 AM, Fri - 4 August 23
కీర్తి సురేష్ – తమన్నాలతో మల్టీస్టారర్! తెలుగు డైరెక్టర్ మాస్టర్ ప్లాన్?

ఈ మధ్యకాలంలో హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చూశాం. ఎంత పెద్ద స్టార్స్ అయినా.. ఎవరి సినిమా వారిదే అన్నట్లు కాకుండా గెస్ట్ రోల్స్ చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఇదివరకు ఒకరితో ఒకరికి మధ్య పోటీ వాతావరణం కనిపించేది. కానీ.. బాహుబలి, RRR, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలు తెరపైకి వచ్చాక ఎలాంటి బిగ్ మూవీస్ వస్తున్నాయో చూస్తున్నాం. అయితే.. హీరోలతో కాకుండా హీరోయిన్స్ తో మల్టీస్టారర్ మూవీస్ రేర్ గా వస్తుంటాయి. అంటే.. ఇప్పటిదాకా ఇద్దరు హీరోయిన్స్ ఉండటం.. లేదా ఒకే హీరోయిన్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చూస్తూ వచ్చాము. కానీ.. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో మల్టీస్టారర్ తెరపైకి రానుందని టాక్.

తాజా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలోనే స్టార్  హీరోయిన్స్ కీర్తి సురేష్, తమన్నా లతో ఓ మల్టీస్టారర్ పట్టాలెక్కనుందట. దీనికి డైరెక్టర్ ఎవరో కాదు.. ప్రస్తుతం మెగాస్టార్ తో భోళాశంకర్ తెరకెక్కించిన మెహర్ రమేష్. ఆగష్టు 11న భోళాశంకర్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మెహర్ రమేష్.. రిలీజ్ తర్వాత కాస్త టైమ్ తీసుకొని అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటిదాకా హీరోలను స్టైలిష్ గా చూపించిన ఈ డైరెక్టర్.. ఒకవేళ నిజంగానే ఫిమేల్ మల్టీస్టారర్ సెట్ అయితే.. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కీర్తి సురేష్, తమన్నా తమ తమ కెరీర్స్ పరంగా బిజీ టైమ్ గడుపుతున్నారు. ఈ ఏడాది కీర్తి సురేష్ కి రెండు బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. ఒకటి తెలుగులో దసరా.. తమిళంలో మామన్నన్(తెలుగులో నాయకుడు). ఇప్పుడు చేతిలో భోళా శంకర్ కాకుండా నాలుగు తమిళ సినిమాలు లైనప్ చేసి పెట్టుకుంది. మరోవైపు తమన్నా.. ఒకరోజు గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ చేసింది. అందులో ఒకటి.. ఆగష్టు 10న సూపర్ స్టార్ రజినీ నటించిన జైలర్ కాగా.. రెండోది మెగాస్టార్ భోళా శంకర్. ఈ రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించింది తమన్నా. అయితే.. భోళా శంకర్ లో తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్ చిరుకి చెల్లి క్యారెక్టర్ చేసింది. మరి వీరిద్దరితో మెహర్ రమేష్ మల్టీస్టారర్ అంటే.. ఇంటరెస్టింగ్ టాపిక్ అనే చెప్పాలి. చూడాలి మరి త్వరలో అనౌన్స్ మెంట్ రానుందేమో. మరి తమన్నా, కీర్తి మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి