iDreamPost

వీడియో: నన్ను చూసేందుకు ఎవ్వరూ ఆసుపత్రికి రావొద్దు: KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో ఉన్న సంగతి విదితమే. ప్రమాదవశాత్తూ కాలు జారి పడిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయనకు తుంటి ఎముక మార్పిడి చికిత్స చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవితో పాటు పలువురు ఆయన్నుపరామర్శించారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో ఉన్న సంగతి విదితమే. ప్రమాదవశాత్తూ కాలు జారి పడిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయనకు తుంటి ఎముక మార్పిడి చికిత్స చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవితో పాటు పలువురు ఆయన్నుపరామర్శించారు.

వీడియో: నన్ను చూసేందుకు ఎవ్వరూ ఆసుపత్రికి రావొద్దు: KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అనుకోకుండా ప్రమాదం బారిన పడిన సంగతి విదితమే. తన నివాసంలో కాలు జారి పడటంతో హుటాహుటిన సోమాజిగూడలోని యాశోద ఆసుపత్రికి తరలించారు  కుటుంబ సభ్యులు. అయితే తుంటి ఎముక ప్రాక్చర్ అయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు చికిత్స చేశారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత.. వాకర్ సాయంతో కేసీఆర్‌తో అడుగులు వేయించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

కేసీఆర్ కాలి జారి పడ్డారని, ఆపరేషన్ జరిగిందని తెలియగానే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నటుడు చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ నేతలు యశోద ఆసుపత్రికి వెళ్లి.. ఆయన్ను పరామర్శించారు. అలాగే  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సైతం అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే వారికి తాకిడి పెరిగింది. దీంతో ఓ వీడియోను విడుదల చేశారు కేసీఆర్. తనను చూసేందుకు ఆసుపత్రికి ఎవ్వరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలో కోలుకుని మీ వద్దకే వస్తానని, సంయమనం పాటించాలని సూచించారు.

‘నన్ను చూసేందుకు ఆసుపత్రికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న వేలాది మంది అభిమానులకు ధన్యవాదాలు. అయితే వైద్యుల సూచనల మేరకు.. ఆసుపత్రికి రావొద్దు. ఎక్కువ మంది రావడం వల్ల.. ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని వల్ల సమస్య పెద్దదవుతుంది. నెలల తరబడి బయటకు పోలేనని డాక్టర్లు చెబుతున్నారు. వచ్చిన వారు మీ స్వస్థలాలకు క్షేమంగా తరలిపోవాలి’ అని ప్రజలకు సూచించారు. ఆసుపత్రిలో మనతో పాటు చాలా మంది రోగులు ఉన్నారని, వారిందరినీ ఇబ్బందిని పెట్టకూడదని, పది రోజుల పాటు ఆసుపత్రికి రావొద్దని కోరారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఉన్నాయని, కోలుకున్నాక.. మళ్లీ కలుసుకుందామని చెప్పారు. తన కోరిక మన్నించి..తనకు, ఇతర రోగులకు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా మీ స్వస్థలాలకు చేరుకోవాలని విన్నవించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి