iDreamPost

రైతులకు శుభవార్త.. ఎన్నికల తెల్లారే ఖాతాల్లో ఆ డబ్బులు జమ

  • Published Nov 03, 2023 | 10:13 AMUpdated Nov 03, 2023 | 10:13 AM

నిర్మల్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ రైతులకు శుభవార్త చెప్పారు. ఎన్నికలు ముగిసిన తెల్లారో.. ఆ మరునాడో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఆ వివరాలు..

నిర్మల్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ రైతులకు శుభవార్త చెప్పారు. ఎన్నికలు ముగిసిన తెల్లారో.. ఆ మరునాడో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఆ వివరాలు..

  • Published Nov 03, 2023 | 10:13 AMUpdated Nov 03, 2023 | 10:13 AM
రైతులకు శుభవార్త.. ఎన్నికల తెల్లారే ఖాతాల్లో ఆ డబ్బులు జమ

అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. రైతలును ఆదుకోవడం కోసం పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా ఎకరానికి రూ.10 వేలు రైతు బంధు సాయంగా అందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా రెండు విడతలుగా రైతు బంధు సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. అలానే రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం విడతల వారిగా రైతు రుణ మాఫీ చేయగా.. మరికొంత మందికి చేయాల్సి ఉంది. అయితే ఈ లోపే ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడంతో.. రుణమాఫీకి బ్రేక్ పడింది. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్‌.. రుణమాఫీకి సంబంధించి గుడ్‌ న్యూస్‌ చేశారు. ఆ వివరాలు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా నియాజకవర్గాల పర్యటనలు చేస్తున్న కేసీఆర్.. గురువారం నిర్మల్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌.. రైతు రుణమాఫీ గురించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా.. అందరికి సకాలంలో రుణమాఫీని వర్తింప జేయలేకపోయామని చెప్పుకొచ్చారు. మరి కొందరికి రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేద్దామని భావించిన సమయంలోనే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ప్రస్తుతం రుణమాఫీ ప్రక్రియ ఆగిపోయింది.

అయితే అలాంటి వారందరికి కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే.. రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని కేసీఆర్‌ వెల్లడించారు.  ఒకవేళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తే.. వారం పది రోజుల్లోనే నిధులు విడుదల చేస్తాం. లేదంటే పోలింగ్ తెల్లారే ఖాతాల్లో డబ్బు జమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేసింది. ఇందుకోసం 37 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కేసీఆర్‌ తెలిపారు. లక్ష వరకు ఉన్న రుణమాఫీని పలు దఫాల్లో అమలు చేసింది. లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉన్న వారికి రుణమాఫీ ఆగిపోయింది. వారందరి వివరాలు తీసుకున్న ప్రభుత్వం.. అలాంటి వారికి కూడా రుణమాఫీ అమలయ్యేలా చర్యలు తీసుకుంది.

కాకపోతే ఈ సమయంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం.. దానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయటంతో.. అది కాస్తా ఆగిపోయింది. కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఒకవేళ.. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇప్పటికే సర్కారు దగ్గర రైతుల వివరాలు రెడీగా ఉండటంతో.. ఆటోమెటిక్‌గా రైతు రుణమాఫీ జరిగిపోనున్నట్టు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి