iDreamPost

రజినీ మాటలను సీరియస్ గా తీసుకున్న కావ్య.. ఏడ్చే స్థాయి నుంచి ఏడిపించే స్థాయికి..

Rajinikanth- Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకుపోతోంది. అయితే ఈ ప్రదర్శనకు కారణం రజినీకాంత్ అని మీకు తెలుసా?

Rajinikanth- Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకుపోతోంది. అయితే ఈ ప్రదర్శనకు కారణం రజినీకాంత్ అని మీకు తెలుసా?

రజినీ మాటలను సీరియస్ గా తీసుకున్న కావ్య.. ఏడ్చే స్థాయి నుంచి ఏడిపించే స్థాయికి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే చాలు.. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అందుకు కారణం ప్రత్యర్థి ఎవరైనా సరే హైదరాబాద్ మాత్రం చాకిరేవు పెట్టేస్తోంది. ఢిల్లీ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ టోటల్ ని నమోదు చేసింది. ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరులుగు చేసింది. టాప్ 5 హైఎస్ట్ టీమ్ స్కోర్స్ 3 హైరదాబాద్ పేరిటే ఉండటం విశేషం. అయితే ఇది కేవలం ఈ సీజన్ లో జరిగిన అద్భుతమే. గతమంతా వేరుగా ఉంది. ఈ మార్పునకు కారణం రజినీ కాంత్ అనే విషయాన్ని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

క్రితం సీజన్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే అందరికీ కాస్త తక్కువ అంచనాలు, చిన్న చూపు ఉండేది. నిజానికి మంచి ప్రదర్శన చేసినా కూడా అంత గుర్తింపు ఉండేది కాదు. 120, 130 స్కోర్లు కాపాడుకున్న రోజు కూడా హైదరాబాద్ జట్టును ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటే టేబుల్ టాపర్స్ మాత్రమే కాదు.. మిగిలిన అన్ని జట్లు వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వారితో మ్యాత్ అంటే ఎన్ని రికార్డులు బద్దుల కొడతారో అనే మాట వినిపిస్తోంది.

Rajini words

ఎలాంటి జట్టు అయినా కూడా షెడ్యూల్ లో హైదరాబాద్ జట్టు వస్తోంది అంటే తలలు పట్టుకుంటున్నారు. దీనికి మొత్తానికి కారణం కావ్య మారన్ వేసిన ప్లాన్. దానికి కారణం రజినీ కాంత్ మాటలే అంటున్నారు. రజినీ కాంత్ జైలర్ ఆడియో లాంఛ్ లో కీలక వ్యాఖ్యలు చేశాడు. కావ్య మారన్ బాధ నేను చూడలేకపోతున్నాను. హైదరాబాద్ జట్టు ఓడిపోయినప్పుడు కావ్య బాధ చూడలేక ఛానల్ కూడా మార్చేస్తున్నాను. కళానిధి మారన్ కు ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నా. మంచి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి. వేలంలో మెరుగైన ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. జట్టును మరింత బలోపేతం చేసుకోవాలి అంటూ రజినీ కాంత్ కళానిధి మారన్ కు సలహా ఇచ్చారు.

ఈ మాటలను కావ్య పాప చాలా సీరియస్ గా తీసుకుంది. అదే విషయాన్ని ఇప్పుడు టీమ్ ప్రదర్శనలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ జట్టు అంటే ఐపీఎల్ మొత్తానికి వణుకు పుట్టే పరిస్థితి వచ్చేసింది. ఇదే జోరు, ఇదే ఫామ్ ఇలాగే కొనసాగితే హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో కప్పు కొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు హైదరాబాద్ ఫ్యాన్స్ రజినీకాంత్ థ్యాంక్స్ చెప్తున్నారు. అప్పుడు రజినీకాంత్ చెప్పిన మాటలను కావ్య చాలా సీరియస్ గా తీసుకుందని.. ఆ రిజల్ట్స్ ఇప్పుడు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి