iDreamPost

నయనతారకు ఆ అర్హత లేదు.. నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్!

  • Author ajaykrishna Published - 03:53 PM, Sat - 12 August 23
  • Author ajaykrishna Published - 03:53 PM, Sat - 12 August 23
నయనతారకు ఆ అర్హత లేదు.. నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తమ పని తాము చేసుకుంటూ పోయేవారిలో స్టార్ హీరోయిన్స్ లో నయనతార ఒకరు. కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఫేస్ చేసింది. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లోను ఎన్నో ఆటుపోట్లు చూసింది. ఆఖరికి అన్నింటి నుండి బయటికి వచ్చి.. మెల్లగా కెరీర్ పై ఫోకస్ పెట్టి.. ఒక్కో హిట్టు కొడుతూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. అంతటి స్టార్డమ్ వచ్చాక.. పూర్తిగా గ్లామర్ షోని పక్కన పెట్టి.. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలు, క్యారెక్టర్ లను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది నయన్. అదిగాక డైరెక్టర్ విగ్నేష్ తో పెళ్లి అయ్యాక సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది.

అలాంటి నయన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కింది సీనియర్ నటి కస్తూరి. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూనే.. సీరియల్స్ లో నటిస్తున్న కస్తూరి.. అప్పుడప్పుడు వివాదాలకు తావిచ్చే విధంగా కామెంట్స్ పెడుతుంటుంది. అలా ఈసారి లేడీ సూపర్ స్టార్ నయనతారపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి.. రచ్చకు తెరలేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాది చిత్రపరిశ్రమలో నయనతారను లేడీ సూపర్‌స్టార్‌ గా అంగీకరించలేమని కస్తూరి తెలిపింది. మరి ఎందుకని అలా అంది? అనంటే.. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ బిగ్గెస్ట్ స్టార్. కమల్ హాసన్, అజిత్, విజయ్ ఇలా ఎందరు హీరోలు ఉన్నప్పటికీ.. రజినీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అని కస్తూరి చెప్పింది.

అదేవిధంగా హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు.. అలనాటి హీరోయిన్స్ కేపి సుందరాంబల్.. విజయశాంతి పేర్లు చెప్పింది కస్తూరి. అంతేగాని నయనతారను లేడీ సూపర్ స్టార్ గా ఒప్పుకోలేం అని చెప్పుకొచ్చింది. అయితే.. కస్తూరి గతంలో కూడా నయనతార సరోగసి ద్వారా బిడ్డలను స్వీకరించినప్పుడు.. అభ్యంతరం తెలిపింది. 2022 జనవరి నుండి ఇండియాలో సరోగసి నిషేధించారు. అలా చేయడం వైద్యపరంగా నేరమని అప్పట్లో కస్తూరి పెద్ద దుమారమే రేపింది. కానీ.. అది నయనతార పర్సనల్ సమస్య అని కస్తూరిపై కూడా విమర్శలు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే.. ఇప్పుడు మరోసారి నయన్ విషయంలో కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి నయన్ నుండి ఏమైనా రియాక్షన్ వస్తుందేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి