iDreamPost

‘ఉస్తాద్’ రివ్యూ! శ్రీసింహా మూవీ ఎలా ఉందంటే..

‘ఉస్తాద్’ రివ్యూ! శ్రీసింహా మూవీ ఎలా ఉందంటే..

ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడుగా పరిచయమైన శ్రీ సింహా.. హీరోగా ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. మత్తు వదలరా మూవీతో హీరోగా మారి.. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, `భాగ్‌ సాలే` సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. వాటి ఫలితాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఉస్తాద్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీ సింహా. తాజాగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాని ఫణిదీప్ తెరకెక్కించారు. మసూద, బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు ఈ సినిమాని నిర్మించారు. మరి యూత్ ఫుల్ ఇంటెన్స్ డ్రామాగా విడుదలైన ఉస్తాద్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

కథ:

సూర్య(శ్రీ సింహా) పెద్దయ్యాక పైలట్ కావాలని అనుకుంటాడు. విమానం నడపాలని ఎంతో కష్టపడి చదివి.. ఆఖరికి పైలట్ అయిపోతాడు. ఫైలట్‌ అయ్యాక ఫ్లైట్ ని తన బాస్‌ కెప్టెన్‌( గౌతమ్ మీనన్) సారథ్యంలో స్మూత్ గా ల్యాండింగ్‌ చేయాల్సి వస్తుంది. ఓవైపు బాస్ ఉన్నాడని టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక తన బాస్ తో తన లైఫ్ స్టోరీ షేర్ చేసుకుంటాడు. ఈ క్రమంలో తన బైక్ గురించి.. లవ్ గురించి బయట పెడతాడు. అసలు బైక్ కి సూర్యకు ఉన్న రిలేషన్ ఏంటి? మేఘన(కావ్య)తో లవ్ ట్రాక్ ఏమైంది? పైలట్ అయ్యాక సూర్య లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

సాధారణంగా ఇండస్ట్రీలోకి వారసులు వస్తున్నారంటే పేరెంట్స్ హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. వారే స్టోరీ సెలక్షన్, టెక్నికల్ టీమ్ సెట్ చేసి పెడుతుంటారు. శ్రీసింహా లైఫ్ లో ఇవేవి జరగట్లేదనుకుంట. పేరుకు రాజమౌళి, కీరవాణిల ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్టోరీ సెలక్షన్ కూడా తానే చేసుకుంటున్నాడేమో. ఎందుకంటే.. సబ్జెక్టులు బాగానే ఉన్నప్పటికీ తనకు ఏవి సూట్ అవుతాయి? అనే జడ్జిమెంట్ మిస్ అవుతున్నాడు. ఇప్పటిదాకా చేసిన వాటిలో ఏ ఒక్కటి పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం గమనార్హం. రీసెంట్ గా భాగ్ సాలే కూడా అలాంటి ఫలితమే మిగిల్చింది.

ఇక ఉస్తాద్ విషయానికి వస్తే.. సూర్య అనే క్యారెక్టర్ పైలట్ కావాలనే దశలో.. అతనికి ఓ వైపు బైక్ ని, మరోవైపు లవ్ ని జోడించి ఈ సినిమా రాసుకున్నాడు డైరెక్టర్ ఫణిదీప్. అందులోనూ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ద్వారా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. అయితే.. కథ పరంగా ఉస్తాద్ కొత్తగా ఉన్నప్పటికీ.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ తడబడ్డాడు. ఈ విషయం చూస్తున్న ఆడియన్స్ కి క్లియర్ గా అర్ధమవుతుంది. స్క్రీన్ ప్లేని అంత ఎంగేజింగ్ గా నడిపించలేకపోయాడు డైరెక్టర్. అందులోనూ నేరేషన్ కూడా స్లో అవ్వడంతో అసలు మ్యాటర్ కాస్త బోర్ కొట్టే స్థితికి చేరుకుందని చెప్పాలి. అసలే ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ సినిమాలకు స్క్రీన్ ప్లే రేసిగా సాగాలి.

ఉస్తాద్.. సినిమా మొదలైన కాసేపటికి ప్రేక్షకులలో బోర్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే.. సినిమా నడక ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. స్క్రీన్ ప్లే క్లారిటీగా రాసుకోలేదో లేక ఆడియన్స్ కి అర్ధం కాలేదో గానీ.. సన్నివేశాలు చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తాయి. అవేగాక స్లో నేరేషన్ వలన డైలాగ్స్ కూడా వీక్ గా అనిపిస్తాయి. ఇక కామెడీ విషయానికి వస్తే.. వర్కౌట్ కాలేదని చెప్పాలి. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కూర్చోబెట్టే సన్నివేశాలు సినిమాలో కనిపించకపోవడం మైనస్. వెరసి.. పైలట్ అవ్వాలనే యువకుడి కథలా కాకుండా.. బైక్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి దాని బయోపిక్ లా అనిపిస్తుంది.

సినిమాలో ఆకట్టుకునే సన్నివేశాలు అరుదుగా ఉన్నాయి.నిజానికి మంచి ఫీల్ ఉన్న కథ ఇది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా లాంటి ఫీల్ క్యారీ అవ్వాల్సింది. కానీ.. ల్యాగ్.. స్క్రీన్ ప్లే క్లారిటీ లేక నార్మల్ బోరింగ్ డ్రామాలా సాగిపోయింది. కావ్యతో లవ్ ట్రాక్ బాగుంది. బట్.. దానికి పూర్తిగా న్యాయం జరగలేదు. కథలో బలమైన ఎమోషన్స్ అన్ని బైక్ తో ముడిపడి ఉన్నాయి. ఆ ఎమోషన్స్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలోపు వేరే సన్నివేశాలు అడ్డు పడుతుంటాయి. కావ్యతో లవ్.. లవ్ లెటర్ సీన్.. బాగున్నాయి. ఇక ఫ్రీక్లైమాక్స్ లో బైక్‌ ఎపిసోడ్‌, లవ్‌ ట్రాక్ కి ఉండే లింక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బైక్ తో హీరో మాట్లాడటం, లవర్ దగ్గరికి వెళ్లడంలో ఫీల్ ఉంది. క్లైమాక్స్ మాత్రం వీక్ గా ఎండ్ చేశాడు డైరెక్టర్. ఏదో అసంతృప్తిగా ఎండింగ్ మిగిలిపోతుంది.

ఇదిలా ఉండగా.. నటుడిగా శ్రీ సింహా న్యాయం చేశాడు. తన యాక్టింగ్ స్కిల్స్ ఇందులో క్లియర్ గా కనిపిస్తాయి. మేఘన క్యారెక్టర్ లో కావ్య మెప్పించింది. హీరో తల్లిగా అను హాసన్‌ బాగా చేసింది. ఇక మిగతా నటినటులంతా పర్వాలేదనిపించారు. ఈ సినిమాకి అకీవ బీ మ్యూజిక్‌ కొంత వరకే హెల్ప్ అయ్యింది. కథలో భాగంగా పాటలు సాగుతాయి. కానీ.. గుర్తుంచుకోదగ్గ పాటలు లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ కి చాలా వర్క్ ఉంది. స్క్రీన్ ప్లే ప్రకారం వెళ్లినా.. అవసరం లేని సన్నివేశాలు లేపేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఫణిదీప్.. కథను బాగా రాసుకున్నాడు. కానీ.. కథనం విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయాడు. ఫీల్ గుడ్ స్టోరీని అంతే ఫీల్ తో తెరపై ఆవిష్కరించలేకపోయాడు. మరి అసలు ఫలితం ప్రేక్షకులు నిర్ణయించాల్సి ఉంది.

ప్లస్ లు:

  • కథ
  • కెమెరా వర్క్
  • లీడ్ పెయిర్
  • బైక్ ఎమోషన్

మైనస్ లు:

  • కథనం
  • సన్నివేశాల సాగదీత
  • వీక్ రైటింగ్
  • కామెడీ

చివరిమాట: ఉస్తాద్.. ఓపిక హుష్ కాక్!

రేటింగ్: 2/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి