iDreamPost
android-app
ios-app

భర్తపై కోపం, పోలీసులకు షాకిచ్చిన మహిళ! ఏం చేసిందో తెలుసా?

భార్యాభర్తలు గొడవలు పడడం అనేది కామన్. అచ్చం ఇలాగే భర్తపై కోపంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. దీంతో తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు. ఇంతకు ఈ మహిళ ఏం చేసిందంటే?

భార్యాభర్తలు గొడవలు పడడం అనేది కామన్. అచ్చం ఇలాగే భర్తపై కోపంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. దీంతో తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు. ఇంతకు ఈ మహిళ ఏం చేసిందంటే?

భర్తపై కోపం, పోలీసులకు షాకిచ్చిన మహిళ! ఏం చేసిందో తెలుసా?

భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. ఇంత దానికే కొందరు భార్యలు ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే హత్యలకు కత్తులు నూరుతున్నారు. కానీ, ఓ మహిళ మాత్రం కట్టుకున్న భర్తపై కోపంతో ఎవరూ ఊహించని పనికి తెర లేపింది. దీంతో చివరికి అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ మహిళ పోలీసులకు చిక్కి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. భార్యపై కోపంతో ఆ మహిళ ఏం చేసింది? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక బనశంకరి మారుతి లేఔట్ లో కిరణ్-విద్యారాణి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్ల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగింది. ఇదిలా ఉంటే.. విద్యారాణికి సోషల్ మీడియా ద్వారా రామ్ కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో విద్యారాణి తరుచు రామ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఇక భర్తకు అనుమానం రావడంతో ఇటీవల ఓ రోజు గమనించాడు. అప్పటికీ విద్యారాణి ఫోన్ లో మాట్లాడుతూ కనిపించింది. ఇది చూసి భర్త కోపంతో ఊగిపోయాడు.

వెంటనే భార్య విద్యారాణి సెల్ ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టాడు. దీంతో ఆ ఫోన్ మూడు ముక్కలైంది. భర్త చేసిన పనికి భార్య అతడిపై కోపం పెంచుకుంది. ఎలాగైన మొగుడిపై పగ తీర్చుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే ఇదే విషయాన్ని విద్యారాణి ప్రియుడికి తెలియజేసింది. దీంతో ఇద్దరూ పక్కా ప్లాన్ తోనే భర్తను ఇరికించాలని అనుకున్నారు. ఇంతకు విద్యారాణి ఏం చేసిందంటే? ఇటీవల భర్త ఫోన్ తీసుకుని అతని వాట్సాప్ ద్వారా.. ఆర్ డీ ఎక్స్ బాంబు పెట్టారంటూ మెసేజ్ పంపింది. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు కిరణ్ ఇంటికి వచ్చారు. బాంబు ఎక్కడ పెట్టారని కిరణ్ ను ప్రశ్నించగా అతడు నోరెళ్లబెట్టాడు.

నేను ఆ బాంబు పెట్టలేదని కిరణ్ మొత్తుకున్నాడు. ఇక తీరా అతని భార్యను విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. తన భర్తపై కోపంతో కావాలనే నేను ఇలా చేశానని తెలిపింది. ఆ మహిళ మాటలు విని పోలీసులు, ఆమె భర్త కిరణ్ షాక్ కు గురయ్యారు. అనంతరం పోలీసుల విద్యారాణిపై కేసు నమోదు చేసుకుని మరో ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. భర్తపై కోపంతో ఇలా పోలీసుల సమయాన్ని వృధా చేయడం ఏంటని పలువురు విద్యారాణి తీరుపై మండిపడ్డారు. భర్తపై కోపంతో పోలీసులకు షాకిచ్చిన విద్యారాణి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişmeritbet