iDreamPost
android-app
ios-app

కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా నడి రోడ్డుపై..!

  • Published Aug 28, 2023 | 8:09 AM Updated Updated Aug 28, 2023 | 8:09 AM
  • Published Aug 28, 2023 | 8:09 AMUpdated Aug 28, 2023 | 8:09 AM
కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా నడి రోడ్డుపై..!

ఈ మధ్యకాలంలో చాలా మంది ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు భార్యాభర్తలు ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతూ సంసారాన్ని బజారు కీడ్చుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. క్షణికావేశంలో హత్యలు లేదా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే భర్త భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగు చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రాంబాబు-సంధ్య అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహ అనంతరం భార్యాభర్తలు సంతోషంగానే కాపురాన్ని కొనసాగించారు. ఇక ఏడాది కిందట వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య భర్త రాంబాబు ఓ చైన్ స్నాచింగ్ కేసులో జైలుకు వెళ్లి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారు. ఈ క్రమంలోనే సంధ్య భర్తతో ఉండలేక విడాకుల కేసు పెట్టింది. అప్పటి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. దీంతో భర్త రంబాబుకు భార్యపై కోపం మరింత పెరిగిపోయింది. ఎలాగైన భార్యను హత్య చేయాలని పథకం రచించాడు.

ఇందులో భాగంగానే.. శనివారం సంధ్య తన తండ్రితో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లింది. అప్పటికే కాపుకాసి ఉన్న భర్త రాంబాబు భార్య హత్యకు ప్లాన్ గీశాడు. ఆలయం నుంచి భార్య రాగానే ఆమెను కత్తితో పొడిచాడు. పట్టపగలు అందరి ముందే భర్త దారుణానికి ఒడిగట్టి చివరికి భార్య ప్రాణాలు తీసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: వీడియో: దొంగతనం ఇలా కూడా చేస్తారా! వామ్మో.. ఇది వేరే లెవల్..!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş