iDreamPost
android-app
ios-app

తహసీల్దార్‌ వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్య!

తహసీల్దార్‌ వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్య!

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల దారుణాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఆడ,మగ అన్న తేడా లేకుండా చిన్నస్థాయి ఉద్యోగులపై పై స్థాయి ఉద్యోగులు నియంతల్లా​ వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక దేశ వ్యాప్తంగా నిత్యం ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. పని ఒత్తిడితో పాటు తహసీల్దార్‌ వేధింపులు తాళలేక ఓ మహిళా ఉద్యోగిని ప్రాణాలు తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కర్ణాటక, మధురగిరిలోని మేదరహట్టి గ్రామానికి చెందిన లతా మోహన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో దాదాపు 15 ఏళ్లుగా పని చేస్తోంది. గత కొద్ది నెలల నుంచి పని ఒత్తిడి బాగా పెరిగింది. దీనికి తోడు గ్రేడ్‌ 2 తహసీల్దార్‌ జయలక్ష్మమ్మ .. లతను బాగా వేధించసాగింది. దీంతో లత ప్రతీ రోజు నరకం అనుభవించసాగింది. రోజురోజుకు పని భారం, తహసీల్దార్‌ వేధింపులు పెరగటంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. గురువారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. గదిలోకి వెళ్లిన లత ఎంతకీ బయటకు రాకపోవటంతో కుటుంసభ్యులకు అనుమానం వచ్చింది.

వెంటనే తలుపులు బద్ధలు కొట్టారు. లోపల లత ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. లత మృతిపై ఆమె భర్త మాట్లాడుతూ.. తమకు ఎలాంటి కుటుంబ సమస్యలు లేవని, పని ఒత్తిడి కారణంగా లత ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.