iDreamPost

భర్త వ్యక్తిగత సమాచారం భార్యకి చెప్పాల్సిన అవసరం లేదు:హైకోర్టు

ఈ మేరకు ఓ మహిళ తన మాజీ భర్త ఆధార్ సహా వ్యక్తిగత వివరాలను కోరుతూ.. దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. కోర్టు సదరు మహిళకు షాక్‌ ఇచ్చింది..

ఈ మేరకు ఓ మహిళ తన మాజీ భర్త ఆధార్ సహా వ్యక్తిగత వివరాలను కోరుతూ.. దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. కోర్టు సదరు మహిళకు షాక్‌ ఇచ్చింది..

భర్త వ్యక్తిగత సమాచారం భార్యకి చెప్పాల్సిన అవసరం లేదు:హైకోర్టు

ప్రపంచంలో ప్రతీ ఒక్క మనిషికి పర్సనల్ ప్రైవసీ అనేది చాలా ముఖ్యమైంది. ఓ వ్యక్తి తన జీవితంలోని ప్రతీ విషయాన్ని మరొకరితో షేర్ చేసుకోవాలనే నియమమేమీ లేదు. ఎవరి ఇష్టానుసారం వారి వారి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. ఇక పర్సనల్ ప్రైవసీ విషయంలో.. వివాహ బంధంలో ఉన్న భార్యాభర్తలైనా సరే దీనికి కట్టుబడి ఉండాల్సిందే. అయితే, తాజాగా ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు చెప్పింది.

వ్యక్తిగత గోప్యత విషయంలో జీవిత భాగస్వామికి కూడా ఎక్సెప్షన్ ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక కేసు విషయాని కొస్తే ఓ మహిళ.. తన మాజీ భర్త భరణం చెల్లించడం లేదని, అతను ఎక్కడ ఉన్నాడో తెలియని కారణంగా.. అతని ఆధార్, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలని కోరుతూ UIDAI కు దరఖాస్తు చేసింది. కానీ, డీటెయిల్స్ ఇవ్వడం కుదరదని ఆ సంస్థ తేల్చి చెప్పింది. హుబ్బళికి చెందిన మహిళకు 2005 లో వివాహం జరిగింది. ఆ దంపతులకు కూతురు పుట్టిన తర్వాత, వారిద్దరి మధ్యన మనస్పర్థలు మొదలయ్యాయి.

దీనితో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో భార్యకు భరణంగా రూ. 10,000 , కూతురి సంరక్షణకు అదనంగా మరో రూ. 5000 లను ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు సదరు భర్తను ఆదేశించింది. కానీ, అతను ఆ ఆదేశాలను పాటించలేదు. ఈ కారణంగా ఆమె మరల ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అతని ఆధార్‌ కార్డు వివరాలను ఇవ్వాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI )ను కోరింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. తాము వివరాలు ఇవ్వలేమని 2021 ఫిబ్రవరి 25న UIDAI తిరస్కరించింది.

ఈ క్రమంలో ఆమె హై కోర్టును సంప్రదించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగల్ జడ్జ్ ధర్మాసనం ఆమెకు అనుకూలంగా చేయాలనీ ఆదేశాలు ఇచ్చింది. కానీ, సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై UIDAI మళ్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. అత్యవసర పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తేనే ఆధార్‌, ఇతర వ్యక్తిగత వివరాలను తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిని UIDAI తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం UIDAI కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఒకరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని.. జస్టిస్‌ ఎస్‌.సునీల్‌దత్‌ యాదవ్‌, జస్టిస్‌ విజయకుమార్‌ ఏ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మరి, ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి