iDreamPost

తన ఫ్రెండ్స్‌తో గడపాలని నా భర్త ఒత్తిడి చేశాడు: స్టార్ హీరోయిన్ ఆవేదన!

  • Published Mar 13, 2024 | 3:46 PMUpdated Mar 14, 2024 | 1:32 PM

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్ ఆమె. సినిమాలతో బిజీగా ఉన్న టైమ్​లోనే ఇష్టపడి ఒక వ్యాపారవేత్తను పెళ్లాడారు. కానీ ఆ భర్తే తనను వేలం వేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారామె.

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్ ఆమె. సినిమాలతో బిజీగా ఉన్న టైమ్​లోనే ఇష్టపడి ఒక వ్యాపారవేత్తను పెళ్లాడారు. కానీ ఆ భర్తే తనను వేలం వేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారామె.

  • Published Mar 13, 2024 | 3:46 PMUpdated Mar 14, 2024 | 1:32 PM
తన ఫ్రెండ్స్‌తో గడపాలని నా భర్త ఒత్తిడి చేశాడు:  స్టార్ హీరోయిన్ ఆవేదన!

ఫిల్మ్ సెలబ్రిటీల్లో డేటింగ్, మ్యారేజ్, డివోర్స్ లాంటివి చాలా కామన్. స్టార్ల పెళ్లిళ్లు, రిలేషన్స్, విడాకులకు సంబంధించి అనేక వార్తలను వింటుంటాం. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటే ఆ రిలేషన్ చాన్నాళ్ల పాటు కొనసాగుతుంది. అదే తేడా వస్తే మాత్రం డివోర్స్​కు దారితీస్తుంది. అయితే సెలబ్రిటీల్లో విడాకులు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇలా భర్త నుంచి విడిపోయిన ఓ హీరోయిన్ తాజాగా తన మ్యారేజ్ లైఫ్ గురించి సంచలన విషయాలను తెలియజేశారు. తన మాజీ భర్త తన మీద ఏకంగా వేలంపాట పెట్టాడని ఆమె చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. కరిష్మా కపూర్. ఒకప్పుడు ఆమె బాలీవుడ్​ను ఏలారు. ప్రతి స్టార్ హీరో సినిమాలో ఆమె ఉండాల్సిందే అనేలా ఏకఛత్రాధిపత్యం నడిపించారు. అయితే టాప్ హీరోయిన్​గా వెలుగొందుతున్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు కరిష్మా.

మ్యారేజ్ లైఫ్​తో పాటు తన మాజీ భర్త సంజయ్ కపూర్ గురించి తాజాగా సంచలన విషయాలను కరిష్మా బయటపెట్టారు. సంజయ్ తన మీద వేలంపాట పెట్టారని ఆమె చెప్పారు. హనీమూన్​లో ఆయనతో పాటు ఫ్రెండ్స్​తో కూడా కలసి తాను సన్నిహితంగా గడపాలని బలవంతం చేశాడని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ‘నా మాజీ భర్త నన్ను వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో నేను ఆ రాత్రి గడపాలని అన్నాడు. కానీ ఇలాంటి నీచమైన పనులు చేయనని తెగేసి చెప్పా. ఆ ఘటన నా లైఫ్​లో మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం. నాతో వివాహమైన తర్వాత కూడా తన మొదటి భార్యతో ఆయన ఎఫైర్ కొనసాగించాడు. ఈ విషయం తెలిసి నేను ఎదురు తిరిగితే మళ్లీ నా మీదే దాడి చేశాడు. ఆయన తల్లి కూడా నన్ను చిత్రవధ చేసింది. అత్తింటి వేధింపులు భరించలేకే నేను డివోర్స్ తీసుకున్నా’ అని కరిష్మా కపూర్ వివరించారు.

Kareeshma kapoor about her husband

సంజయ్ కపూర్​తో 13 సంవత్సరాలు కాపురం చేసిన కరిష్మా.. ఆ తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చేశారు. ఇక, సంజయ్​తో పెళ్లికి ముందు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్​తో ప్రేమాయణం నడిపారు కరిష్మా. అనంతరం ఆయనకు బ్రేకప్ చెప్పేసిన ఈ భామ.. అభిషేక్ బచ్చన్​తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఇది పెళ్లి వరకు వెళ్లలేదు.. మధ్యలోనే క్యానిల్ అయిపోయింది. ఇది జరిగిన కొన్నాళ్లకు 2003లో బిజినెస్​మన్ సంజయ్​ను వివాహం చేసుకున్నారు కరిష్మా. 13 ఏళ్లు కలసి ఉన్న ఈ జంట 2016లో విడిపోయారు. అప్పటి నుంచి కరిష్మా ఒంటరిగానే ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మ్యారేజ్ లైఫ్ గురించి అన్ని విషయాలు బయట పెట్టారు. అత్తింట్లో చాలా వేధింపులకు గురైనట్లు తెలిపారు. కరిష్మా వ్యాఖ్యలు, ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు నెటిజన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె విడాకులు తీసుకోవడంలో తప్పు లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: Premalu Movie: మలయాళ ఇండస్ట్రీలో బెటర్ యాక్టర్స్ ఉంటారన్న రాజమౌళి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి