iDreamPost

Premalu Movie: మలయాళ ఇండస్ట్రీలో బెటర్ యాక్టర్స్ ఉంటారన్న రాజమౌళి

  • Published Mar 13, 2024 | 1:41 PMUpdated Mar 13, 2024 | 1:41 PM

ఫిబ్రవరిలో విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమలు సినిమా మార్చి 8న విడుదలై తెలుగులో కూడా ఘన విజయం సాధించింది.మలయాళ పరిశ్రమలో బెస్ట్ యాక్టర్స్ ఉంటారని, కాస్త ఈర్ష్యతో, బాధతో అయినా మలయాళ సినిమా అత్యుత్తమ నటులని ఇస్తుందన్న విషయం ఒప్పుకోవాలని రాజమౌళి అన్నారు.

ఫిబ్రవరిలో విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమలు సినిమా మార్చి 8న విడుదలై తెలుగులో కూడా ఘన విజయం సాధించింది.మలయాళ పరిశ్రమలో బెస్ట్ యాక్టర్స్ ఉంటారని, కాస్త ఈర్ష్యతో, బాధతో అయినా మలయాళ సినిమా అత్యుత్తమ నటులని ఇస్తుందన్న విషయం ఒప్పుకోవాలని రాజమౌళి అన్నారు.

  • Published Mar 13, 2024 | 1:41 PMUpdated Mar 13, 2024 | 1:41 PM
Premalu Movie: మలయాళ ఇండస్ట్రీలో బెటర్ యాక్టర్స్ ఉంటారన్న రాజమౌళి

ఫిబ్రవరిలో విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమలు సినిమా మార్చి 8న విడుదలై తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. మహేష్ బాబు, నాగ చైతన్య లాంటి వారు ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో రివ్యూలు కూడా రాశారు. ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ‘ ప్రేమలు ‘ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. అందుకే రాజమౌళి కూడా ఈ సినిమాని చూసి మెచ్చుకున్నారు. ఇంత మంచి సినిమాని తెలుగులోకి తెచ్చినందుకు తన కొడుకుని అభినందించారు. కాగా నిన్న రాత్రి జరిగిన ప్రేమలు తెలుగు వెర్షన్ సక్సెస్ మీట్ లో ఆ సినిమాతో పాటు మలయాళ సినిమా పరిశ్రమను ఆకాశానికి ఎత్తేశారు.

ప్రేమలు తెలుగులో విజయం సాధించినందుకు గానూ ఆ చిత్ర యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించగా ఆ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. మలయాళ పరిశ్రమలో బెస్ట్ యాక్టర్స్ ఉంటారని, కాస్త ఈర్ష్యతో, బాధతో అయినా మలయాళ సినిమా అత్యుత్తమ నటులని ఇస్తుందన్న విషయం ఒప్పుకోవాలని రాజమౌళి అన్నారు. ఇక సోషల్ మీడియా సంగతి తెలిసిందే కదా. మలయాళ సినీ ప్రేక్షకులతో పాటు కొందరు తెలుగు నెటిజన్లు రాజమౌళి వ్యాఖ్యలను సమర్ధిస్తే, మరి కొందరు మలయాళ సినీ పరిశ్రమను మరీ ఎక్కువగా పొగడాల్సిన అవసరం లేదని అన్నారు.

Rajamouli

ఈ విషయాన్ని పక్కన పెడితే రాజమౌళి ప్రేమలు సినిమా యూనిట్ ను ప్రశంసల వర్షంలో ముంచేసారు.తనకు లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు నచ్చవని, యాక్షన్ చిత్రాలు, ఫైట్స్ అంటేనే ఇష్టమని రాజమౌళి తెలిపారు. కానీ ప్రేమలు సినిమా చూస్తూ మొదటి నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నానని చెప్పారు. ప్రేమలు చిత్రానికి తెలుగులో డైలాగ్స్ రాసిన 90స్ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్యని రాజమౌళి ప్రశంసించారు. మలయాళంలో డైలాగులు ఏలా ఉన్నాయో తెలియవు కానీ, తెలుగులో డైలాగ్స్ విని బాగా నవ్వుకున్నానని అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన నస్లెన్, మామితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ వంటి నటీనటులను రాజమౌళి మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ గురించి మరీ మరీ చెప్తూ… గీతాంజలి లో గిరిజ, ఫిదాలో సాయి పల్లవి లాగా మామితా కూడా నెక్స్ట్ హార్ట్ త్రోబ్ అవుతారని అన్నారు. కాగా ప్రేమలు సినిమా సక్సెస్ ఈవెంట్‌కు రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకులు అనుదీప్, అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. సినిమా లాగానే ఈ సక్సెస్ మీట్ కూడా ఆద్యంతం నవ్వులు పూయించింది.

ప్రేమలు సక్సెస్ మీట్: మలయాళ సినిమాకు రాజమౌళి సెల్యూట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి