iDreamPost

Kareena Kapoor: తెలుగులో నాకూ చెయ్యాలని ఉంది

కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. అనేక విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. తాజాగా ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. అనేక విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. తాజాగా ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Kareena Kapoor: తెలుగులో నాకూ చెయ్యాలని ఉంది

తెలుగు సినిమాలంటే ఒకప్పుడు కేవలంగా చూసేది బాలీవుడ్. ఎన్టీఆర్, ఎఎన్నార్ లాంటి లెజెండ్స్ ఇక్కడ ఉన్నా వాళ్ళెప్పుడూ బాలీవుడ్ ఊసెత్తేవారు కాదు. వాళ్ళ ఘనతలు, గౌరవాలు అన్నీ తెలుగు వరకే పరిమితమైపోయాయి. మహ అయితే మద్రాసులో తెలుగు చిత్రపరిశ్రమ అనేక దశాబ్దాలు ఉంది కాబట్టి తమిళులకి మన వాళ్ళ గొప్పతనం కొంతవరకూ వంటి బట్టింది. తమిళంలో మహారథి కర్ణ తీసినప్పుడు కూడా శివాజీ గణేషన్ కర్ణుడు వేస్తే, శ్రీక్రిష్ణ పాత్రకి మాత్రం బ్రతిమాలుకుని మరీ ఎన్టీఆర్ చేతనే చేయించుకున్నారు. తెలుంగు సింగం అని ఎంజీఆర్ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ని సంబొధించిన సందర్భాలున్నాయి.

కానీ బాలీవుడ్ ఎంతసేపూ వాళ్ళ ఘనతలతోనే వాళ్ళు భుజాలు చరుచుకుంటూ ఉండడంతోనే సరిపోయింది. అలాగే నేషనల్ అవార్డులు కూడా మళయాళం, కన్నడ సినిమాలు లాబీయింగులతో కొట్టేసేవారు. మనవాళ్ళు అవార్డు పిల్ముల వైపు ఎప్పుడూ పోయిన అవకశాలే లేవు ఏనాడూ. తన తెలుగువాళ్ళకు దక్కాల్సిన గౌరవం సరింగా దక్కట్లేదని కినుక వహించిన మెగాస్టార్ చిరంజీవి ప్రతిబంధ్ సినిమా చేసి బాలీవుడ్ గుండెల్లో దడ పుట్టించిన మొదటి హీరో. తర్వా త రాజమౌళి భూకంపం తెప్పించాడు. ప్రభాస్ బాలీవుడ్ గుండెల మీద నిలబడ్డాడు.

Kareena Kapoor I also want to do it in

పుష్ఫ సినిమాతో అల్లు అర్జున్ మైకం తెప్పించాడు నార్తంతా. కెజీఎఫ్ సినిమా చెమటలు పోయించింది. ఇప్పుడింక సినిమా రివర్స్ అయిపోయింది. తెలుగులో నటించడానికి ఇష్టపడని హిందీ నటిగానీ, నటుడుగానీ ఇంచుమించు లేరు. ప్రతిబంధ్ సినిమాకి మాధరి దీక్షిత్ గురించి ట్రై చేసినా కూడా బాలీవుడ్ మంత్రాంగం చేసి మాధురీ డేట్స్ దొరక్కుండా చేసింది. అది వేరే కథ. సరే మనకి ఏనాటి నుంచో అలవాటైనా మాంత్రికుడు అమ్రిష్ పురి, తర్వాత రోజులలో పరేష్ రావెల్ ఇలా హిందీ నటులు మనకి అలవాటయ్యారు. కానీ హీరోయన్లు మాత్రం అక్కడే ఉండిపోయారు. మన తెలుగు హీరోయిన్లు, సౌత్ బ్యూటీస్ అనిపించుకున్న వైజయంతీమాల, పద్మని, హేమమాలిని హిందీలో గట్టిపోటీనే ఇచ్చారు.

శ్రీదేవి గురించి ఇంక చెప్పనక్కర్లేదు. ఆలిండియా క్వీన్ గా తిరుగులేని స్థానాన్ని సాధించింది. అనేకమంది నగ్మా దగ్గర్నుంచీ తీసుకుంటే ఎంతో మంది ఈరోజు వరకూ కూడా తెలుగులోనే కెరీర్లు ప్రారంభించి ఇక్కడే సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా కరీనా కపూర్ లాంటి హీరోయిన్ కూడా తెలుగులో చేయాలనే ఆసక్తి కనబరుస్తోంది అదీ విశేషం. కానీ నలభయ్యో పడిలో పడిపోయిన కరీనా కపూర్ కి ఎటువంటి వేషాలు ఇస్తారో, మన దర్శకులు ఇవ్వగలరో వెయిట్ చేసి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి