iDreamPost

పూరీ మాస్-టెర్మెండ్, ప్ర‌శంసించిన‌ కరణ్ జోహార్

పూరీ మాస్-టెర్మెండ్, ప్ర‌శంసించిన‌ కరణ్ జోహార్

లైగ‌ర్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాధ్ వ‌ర్క్ ని అభినందిస్తూ, అత‌ను తీసిన సినిమాల‌తో వీడియో పోస్ట్‌ను షేర్ చేశాడు కరణ్ జోహార్.

పూరీ జగన్నాధ్ కి సౌత్ ఇండస్ట్రీలో చాలామంది అభిమానులున్నారు. హీరోల‌కు పెద్ద బ్లాక్ బస్టర్లను ఇచ్చాడు. పోకిరిలాంటి సినిమాలు ఇతర భాషల్లోకి కూడా రీమేక్ అయ్యాయి. చిన్న బడ్జెట్ సినిమాలతోపాటు భారీ సినిమాల‌ను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు కరణ్ జోహార్‌తో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన లిగర్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.

కరణ్ జోహార్ నిర్మాత మాత్రమే కాదు, బాలీవుడ్‌లోని టాప్ ఫిల్మ్ మేకర్‌. పూరీ జగన్నాధ్ డైరెక్ష‌న్ తెగ న‌చ్చేసింది. అందుకే సోషల్ మీడియాలో పోస్ట్‌ను పూరికి అంకితమిచ్చాడు. లిగర్ డైరెక్ట‌ర్ ని ‘మాస్-టెర్మైండ్’ అని చెప్పాడు. ఈడియ‌ట్ నుంచి ఇస్మార్ట్ శంక‌ర్ వ‌ర‌కు పూరి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా క్లిపింగ్ ల వీడియోను షేర్ చేశాడు.

పూరీ జగన్నాధ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఈనాటి మాస్ టర్మైండ్ చెప్పాడు. అలాంటి విలక్షణమైన ఈ డైరెక్ట‌ర్, ఇంత లార్జ‌ర్ దెన్ లైఫ్ సినిమాల‌ను ఎలా తీశాడో అని ఆశ్చ‌ర్య‌పోతుంటాను. అనేక భాషల్లో #Ligerని పాన్ ఇండియా రిలీజ్ చేయ‌డం ధర్మ ప్రొడక్షన్స్‌లో మాకు గర్వకారణం. పూరి సర్, అతని టీమ్‌తో పాటు, ఛార్మీ లీడ‌ర్ షిప్ తో ఈ ప్రాజెక్ట్ సాధ్య‌మైంది. ఇంకెవ‌రితోనూ ఇలా చేయ‌లేను. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌కి ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది కష్టాలు, మ్యాజిక్, వినోదాన్నిపెద్ద తెరపై చూసేందుకు రెడీగా ఉండ‌మ‌ని ఫ్యాన్స్ ని కోరాడు.

ఇక Liger గురించి చెప్పాలంటే ఇది Vijay Deverakonda , boxing legend Mike Tysonకు Bollywood అరెంగ్రేటం. ఈ సినిమాలో Ananya Panday హీరోయిన్. August 25న‌ Hindi, Malayalam, Tamil, Telugu, Kannadaల్లో రిలీజ్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి