SNP
SNP
భారత దిగ్గజ మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్‌కు గురైనట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఆందోళనకు గురయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేస్తూ.. ‘ఇంకా ఎవరికైనా ఈ వీడియో క్లిప్ వచ్చిందా? ఇది వాస్తవం కాదని అనుకుంటున్నాను. కపిల్ పాజీ బాగానే ఉన్నారు!’ అంటూ పేర్కొన్నాడు. కానీ, కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యారనే విషయం క్రికెట్ వర్గాల్లో దావానంలా వ్యాపించింది.
అయితే.. కిడ్నాప్ వార్తలో నిజం లేదని తేలింది. ఓ యాడ్ షూట్‌లో భాగంగా.. కొంతమంది వ్యక్తులు కపిల్ దేవ్‌ను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యారంటూ వార్తలు చెక్కర్లుకొట్టాయి. గౌతమ్ గంభీర్ లాంటి స్టార్ క్రికెటర్ దీని గురించి ట్వీట్ చేయడంతో.. క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయింది. మొత్తానికి కపిల్ పాజీ కిడ్నాప్ కాలేదనే విషయం తెలియడంతో ఊపరి పీల్చుకున్నారు క్రికెట్ అభిమానులు. కాగా, కపిల్ దేవ్ భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్లలో ఒకరు. 1983లో ఇండియాకు మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్‌ను అందించిన కెప్టెన్. పైగా గొప్ ఆల్‌రౌండర్. ఇప్పటికీ ఆయన నెలకొల్పిన కొన్ని రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరి కపిల్ దేవ్ కిడ్నాప్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp
— Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023
ఇదీ చదవండి: BREAKING: ఆసియన్ గేమ్స్‌లో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కు స్వర్ణపతకం