iDreamPost

కేన్ మామ అరుదైన ఘనత.. బ్రాడ్ మన్, విరాట్ కోహ్లీ సరసన

  • Author Soma Sekhar Published - 10:09 AM, Thu - 30 November 23

గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన కేన్ మామ రెచ్చిపోయి ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సాధించాడు.

గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన కేన్ మామ రెచ్చిపోయి ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సాధించాడు.

  • Author Soma Sekhar Published - 10:09 AM, Thu - 30 November 23
కేన్ మామ అరుదైన ఘనత.. బ్రాడ్ మన్, విరాట్ కోహ్లీ సరసన

కేన్ విలియమ్సన్.. గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు ఈ స్టార్ బ్యాటర్. తాజాగా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన కేన్ మామ రెచ్చిపోయి ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి బంగ్లా ఆధిక్యాన్ని తగ్గించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ సెంచరీతో ఏకంగా డాన్ బ్రాడ్ మన్ టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. అదీకాక 32 ఏళ్ల చరిత్రలో వరుసగా 3 టెస్టు శతకాలు బాదిన తొలి కివీస్ ప్లేయర్ గా మరో రికార్డు సాధించాడు.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో కేన్ విలియమ్సన్ సెంచరీతో చెలరేగాడు. 205 బంతుల్లో 11 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. ఈ శతకం ద్వారా కేన్ మామ ఓ అరుదైన ఘనతను నమోదు చేశాడు. విరాట్ కోహ్లీతో పాటుగా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ రికార్డును సమం చేశాడు. విలియమ్సన్ కు ఇది 29వ టెస్టు సెంచరీ కాగా.. విరాట్, బ్రాడ్ మన్ లు కూడా 29 శతకాలు సాధించారు. కాగా.. కోహ్లీ 111 టెస్టుల్లో ఈ ఫీట్ సాధిస్తే.. కేన్ మామ 95 టెస్టు మ్యాచ్ ల్లోనే ఈ రికార్డుల్లో చేరాడు. ఇక వీరి కంటే ముందు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా సచిన్ టెండుల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 51 సెంచరీలు చేయగా.. 45 శతకాలతో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ ఉన్నాడు.

ఇక ఈ లిస్ట్ లో స్టీవ్ స్మిత్(32), జో రూట్(30) సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా.. 32 ఏళ్ల చరిత్రలో వరుసగా 3 టెస్టు శతకాలు బాదిన తొలి న్యూజిలాండ్ ప్లేయర్ గా మరో రికార్డు సాధించాడు కేన్ మామ. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసి.. 42 పరుగులు వెనకబడి ఉంది. కివీస్ జట్టులో డార్లీ మిచెల్(41), గ్లెన్ ఫిలిప్(42) రన్స్ చేశారు. క్రీజ్ లో జెమీసన్(9), కెప్టెన్ టిమ్ సౌథీ(3) పరుగులుతో బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 4 వికట్లతో కివీస్ నడ్డి విరిచాడు. ఇక బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 310 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మరి కేన్ విలియమ్సన్ విరాట్ కోహ్లీ సరసన చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి