iDreamPost
android-app
ios-app

పెళ్లి రోజు మృతి చెందిన వరుడు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

పెళ్లి రోజు మృతి చెందిన వరుడు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి రోజు నాడే వరుడు మృతి చెందాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తుంది. అయితే పెళ్లి రోజు నాడే ఈ యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు వరుడు ఎలా చనిపోయాడు? అసలేం జరిగిందందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో రాజేందర్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాగా, ఇతడికి రాంపూర్ కు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇందులో భాగంగానే రాజేందర్ గత కొన్ని రోజుల కిందట పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లాడు. కానీ, అప్పటి నుంచి ఆ యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. అతని కుటుంబ సభ్యులు అందరూ బంధువులకు సమాచారం ఇచ్చారు. అయినా అతని ఆచూకి మాత్రం తెలియలేదు.

దీంతో చేసేదేం లేక అతని కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లో గాలించారు. ఈ క్రమంలోనే రాజేందర్ లింగంపేట మండలం ఎల్లారం గ్రామంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకుని రాజేందర్ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. పెళ్లి రోజు నాడే రాజేందర్ శవమై కనిపించడంతో ఇంటిల్లిపాది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పెళ్లి రోజు నాడే వరుడు చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026