iDreamPost

Kalki 2898 AD: కల్కి టీమ్‌తో పని చేయాలనుకుంటున్నారా.. మేకర్స్‌ బంపారఫర్‌.. త్వరపడండి

  • Published Apr 29, 2024 | 11:18 AMUpdated Apr 29, 2024 | 11:18 AM

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్న కల్కి టీమ్‌.. ఓ క్రేజీ ఆఫర్‌ ప్రకటించింది. కల్కి టీమ్‌తో కలిసి పని చేసే అవకాశం కల్పించింది. ఆ వివరాలు..

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్న కల్కి టీమ్‌.. ఓ క్రేజీ ఆఫర్‌ ప్రకటించింది. కల్కి టీమ్‌తో కలిసి పని చేసే అవకాశం కల్పించింది. ఆ వివరాలు..

  • Published Apr 29, 2024 | 11:18 AMUpdated Apr 29, 2024 | 11:18 AM
Kalki 2898 AD: కల్కి టీమ్‌తో పని చేయాలనుకుంటున్నారా.. మేకర్స్‌ బంపారఫర్‌.. త్వరపడండి

ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాక ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న సినిమా.. డార్లింగ్‌ ప్రభాస్‌ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పాన్‌ ఇండియా వైడ్‌గా ఆసక్తి, అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకోనె వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఆయ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు, ట్రైలర్లు సినిమా మీద అంచనాలను రోజుకు రోజుకు పెంచుతున్నాయి. సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్‌ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. ఇక తాజాగా విడుదలైన అమితాబ్‌ లుక్‌ పోస్టర్‌, కల్కి రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన అప్డేట్లు.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా కల్కి టీమ్‌ ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. కల్కి టీమ్‌తో కలిసి పని చేసే అవకాశం కల్పించింది. ఆ వివరాలు..

ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌.. కెరీర్‌లోనే కల్కి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. సైన్స్‌, పురాణాలు కలిపి.. కల్కిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం డార్లింగ్‌ అభిమానులతో పాటు.. యావత్‌ దేశంలోని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఏడాది జూన్‌ 27న కల్కి సినిమా విడుదల కాబోతుందని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ  సినిమా గురించి వివరిస్తూ అంచనాలను మరింత పెంచుతున్నాడు. దాంతో సినిమా పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

కల్కి సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో మేకర్స్ అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించారు. గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లు, మార్కెటింగ్ ఔత్సాహికులు, ఆసక్తి కలిగిన వారు కల్కి టీం లో చేరవచ్చు అని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఇక ప్రభాస్ సినిమా అంటే యూత్‌లో క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. దాంతో ఈ అవకాశాన్ని వినియోగించకునేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి