iDreamPost
android-app
ios-app

DC vs LSG: అభిషేక్ పోరెల్ బ్యాటింగ్ విధ్వంసం.. కీలక మ్యాచ్​లో పిచ్చకొట్టుడు కొట్టాడు!

  • Published May 14, 2024 | 8:26 PMUpdated May 14, 2024 | 8:47 PM

లక్నో సూపర్ జియాంట్స్​ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్. పిచ్చకొట్టుడు కొడుతూ వాళ్లను భయపెట్టాడు.

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. లక్నో సూపర్ జియాంట్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఆ టీమ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ అయితే పిచ్చకొట్టుడు కొట్టాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టిన పోరెల్.. 21 బంతుల్లోనే 50 పరుగుల మార్క్​ను చేరుకున్నాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందరి మీదా అతడు విరుచుకుపడ్డాడు.

పోరెల్​తో పాటు స్టార్ బ్యాటర్ షై హోప్ (27 బంతుల్లో 38) కూడా సత్తా చాటాడు. వీళ్లిద్దరి మధ్య రెండో వికెట్​కు 92 పరుగుల పార్ట్​నర్​షిప్ నమోదైంది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్​గర్క్ గోల్డెన్ డకౌట్​గా వెనుదిరగడంతో మంచి భాగస్వామ్యం అవసరమైంది. ఆ సమయంలో పోరెల్-హోప్ బాధ్యతాయుతంగా ఆడారు. హోప్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడగా.. పోరెల్ మెరుపు షాట్లతో లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. మరి.. పోరెల్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి