iDreamPost

సొంతిల్లు, కారు లేవు.. నరేంద్ర మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

పదేళ్లుగా భారత ప్రధానిగా సేవలందిస్తున్న మోడీ ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మూడో సారి వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు.

పదేళ్లుగా భారత ప్రధానిగా సేవలందిస్తున్న మోడీ ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మూడో సారి వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు.

సొంతిల్లు, కారు లేవు.. నరేంద్ర మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఏడు దశల్లో జరుగనున్న ఈ ఎన్నికలు మరో మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆయనకిది మూడోసారి. ఇక ఎన్నికల్లో పోటీచేసే ఏ రాజకీయ నాయకుడైనా స్థిర, చర ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు వెల్లడించాల్సిందే. ఈ నేపథ్యంలో మోదీ నామినేషన్ దాఖలు సందర్భంగా తన ఆస్తులు, అప్పుల గురించి ఆ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. ఇంతకీ మోడీకి ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

సామాన్య కార్త కర్త నుంచి మొదలు పెట్టిన మోడీ రాజకీయ జీవితం భారత ప్రధాని వరకు తిరుగు లేని రాజకీయ నాయకుడిగా ఎదిగారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు సేవలందించారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా రెండు పర్యాయాలుగా ప్రధానిగా సేవలందిస్తున్నారు మోడీ. ఇక మూడోసారి అధికారం చేజిక్కించుకుని పీఎం పదవిని చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన ఆయన ఆస్తుల వివరాలను వెల్లడించారు. సీఎంగా, పీఎంగా ఎన్నికోట్లు సంపాదించారో అని అంతా అనుకుంటారు. కానీ మోడీ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

మోడీ తన మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లు అని ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సొంత ఇల్లు, కారు లేవని నామపత్రాల్లో తెలిపారు. అంతేకాకుండా తన పేరు మీద ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ వద్ద నగదు రూపంపలో రూ.52,920 ఉన్నట్లు తెలిపారు. ఇక బ్యాంకు అకౌంట్‌లో రూ.80,304 ఉన్నాయని, రూ.2.85 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవేకాకుండా రూ.2.67 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయని తెలిపారు. ఇక రూ.9.12 లక్షలను నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్‌ పథకంలో పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చే జీతం, బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ తన ఆదాయ మార్గాలని మోడీ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి