iDreamPost
android-app
ios-app

DC vs LSG: వీడియో: లక్నో బౌలర్లతో ఆటాడుకున్న స్టబ్స్.. ఏం కొట్టాడు భయ్యా!

  • Published May 14, 2024 | 9:46 PMUpdated May 14, 2024 | 9:57 PM

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్​లో లక్నో బౌలర్లతో ఆటాడుకున్నాడు ఢిల్లీ హిట్టర్ స్టబ్స్. ఆఖరి ఓవర్లలో తన బ్యాట్​తో విధ్వంసం సృష్టించాడు.

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్​లో లక్నో బౌలర్లతో ఆటాడుకున్నాడు స్టబ్స్. ఆఖరి ఓవర్లలో తన బ్యాట్​తో విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లోనే 3 బౌండరీలు, 4 భారీ సిక్సుల సాయంతో 57 పరుగులు చేశాడు. లక్నో పేసర్లను టార్గెట్​ చేసుకొని బిగ్ సిక్సెస్ కొట్టాడు స్టబ్స్. బాల్ కనబడితే స్టాండ్స్​లో పడాలనేంత కసితో బ్యాటింగ్ చేశాడు. అతడే గనుక ఈ రేంజ్​లో విధ్వంసం సృష్టించకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ 208 పరుగుల భారీ స్కోరు చేసేది కాదు.

స్టబ్స్​తో పాటు అభిషేక్ పోరెల్ (33 బంతుల్లో 58) కూడా లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులతో రెచ్చిపోయాడు. బాదడమే పనిగా పెట్టుకొని ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు బిగ్ షాట్స్​తో అలరించాడు. వీళ్లిద్దరితో పాటు షై హోప్ (27 బంతుల్లో 38), కెప్టెన్ రిషబ్ పంత్ (23 బంతుల్లో 33) కూడా మంచి ఇన్నింగ్స్​లు ఆడారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (10 బంతుల్లో 14) కూడా వేగంగా పరుగులు చేసి టీమ్​కు బిగ్ స్కోరు అందించడంలో తన వంతు సహకారం అందించాడు. మరి.. స్టబ్స్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి