iDreamPost
android-app
ios-app

సామాన్యులకి ఇంతకంటే తక్కువ ధరకి EV దొరకదు.. ఇప్పుడే కొనుక్కోండి

మీరు ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా అతి తక్కువ ధరకే ఈ స్కూటర్ ను లాంచ్ చేసింది. త్వరపడండి.

మీరు ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా అతి తక్కువ ధరకే ఈ స్కూటర్ ను లాంచ్ చేసింది. త్వరపడండి.

సామాన్యులకి ఇంతకంటే తక్కువ ధరకి EV దొరకదు.. ఇప్పుడే కొనుక్కోండి

రానురాను పెట్రల్ తో నడిచే వాహనాల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా నడుస్తోంది. లేటెస్ట్ ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో వస్తుండడంతో ఈవీలకు ఆధరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు అధికంగా ఉండడం, అదే సమయంలో ఈవీల ధరలు కూడా బడ్జెట్ ధరల్లోనే ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లను కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ సేల్స్ లో ఓలా దూసుకెళ్తోంది. ఓలా కంపెనీకి చెందిన ఈ స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు తక్కువ ధరకే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఓలా లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ను మీరు 69 వేలకే దక్కించుకోవచ్చు.

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా మార్కెట్ లో అదరగొడుతోంది. ఇప్పటికే ఓలా నుంచి విడుదలైన ఈవీలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ఓలా నుంచి ఓలా ఎస్1ఎక్స్ రిలీజ్ అయ్యింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. ఇది ప్రస్తుతం ఓలా లైనప్ లో ఉన్న స్కూటర్లు అన్నింటిలోకి అతి తక్కువ ధరకు లభ్యమవుతోంది. 2కేడబ్ల్యూ వేరియంట్ రూ. 69,999, 3కేడబ్ల్యూ రూ. 84,999, 4కేడబ్ల్యూ రూ, 99, 999 కి అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి అవకాశం.

ఓలా ఎస్1 ఎక్స్ 2కేడబ్ల్యూ వేరియంట్ ఫీచర్ల విషయానికి వస్తే.. సింగిల్ చార్జ్ తో 91 కిలోమీటర్ల ప్రయాణించొచ్చు. 3.3 సెకన్లలో 40 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. దీనిలో మోటార్ గరిష్ట పవర్ అవుట్ పుట్ 6కేడబ్ల్యూ ఉంటుంది. ఈ స్కూటర్లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఈ స్కూటర్లో 3.5 అంగుళాల ఎల్సీడీ టచ్ స్క్రీన్ తో కూడిన ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అంతేకాకుండా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం సంస్థ 8 ఏళ్లు/80 వేల కిలోమీటర్ల వారంటీని ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి