iDreamPost
android-app
ios-app

కల్కీ 2898 AD.. బుజ్జిని రివీల్ చేసిన మేకర్స్.. ఎన్నో స్పెషాలిటీలు కూడా!

Kalki 2898 AD- Bujji- Skratch Episode 4: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన బుజ్జి రానే వచ్చింది. స్క్రాచ్ ఎపిసోడ్ 4లో ఒక ఫ్యూచరిస్టిక్ కారును పరిచయం చేశారు. అయితే ఇంకా పూర్తి సర్ ప్రైజ్ అవ్వలేదు. ఇంకా బాకీ ఉంచారు.

Kalki 2898 AD- Bujji- Skratch Episode 4: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన బుజ్జి రానే వచ్చింది. స్క్రాచ్ ఎపిసోడ్ 4లో ఒక ఫ్యూచరిస్టిక్ కారును పరిచయం చేశారు. అయితే ఇంకా పూర్తి సర్ ప్రైజ్ అవ్వలేదు. ఇంకా బాకీ ఉంచారు.

కల్కీ 2898 AD.. బుజ్జిని రివీల్ చేసిన మేకర్స్.. ఎన్నో స్పెషాలిటీలు కూడా!

డార్లింగ్ ప్రభాస్– నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీపై వరల్డ్ వైడ్ గా బజ్ ఉంది. ఆ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అంతా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ అయితే జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతకన్నా ముందే అసలు కల్కీ అంటే ఏంటి? ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని చెప్పేందుకు స్క్రాచ్ పేరిట మూవీ టీమ్ కొన్ని ఎపిసోడ్స్ ని విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా మే 18న స్క్రాచ్ ఎపిసోడ్ 4ని విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ ఎపిసోడ్ గురించే చర్చలు స్టార్ట్ అయిపోయాయి.

నిన్నటి నుంచి కల్కీ 2898 ఏడీ సినిమా గురించే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేస్తాను అని చెప్పాడు. ఆ బుజ్జి ఎవరో తెలుసుకోవాలి అని అంతా తెగ వెయిట్ చేస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈసారి కూడా కల్కీ మూవీ టీమ్ చెపిన్న టైమ్ కి అప్ డేట్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ అంతా 5 దాటి చాలాసేపు అయ్యింది అంటూ చాలానే ట్వీట్లు వేస్తున్నారు. ఎట్టకేలకు ఆ స్క్రాచ్ ఎపిసోడ్ రానే వచ్చింది. కల్కీ 2898 ఏడీ మూవీ హీరో భైరవ తన బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

మొదట అంతా అమ్మాయి అని.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. చివరకు బుజ్జి అంటే ఒక కారు అనే విషయాన్ని తాజాగా ఈ ఎపిసోడ్ ద్వారా వెల్లడించారు. కల్కీ మూవీలో ప్రభాస్ వాడేది నిజంగానే సూపర్ ఫ్యూచరిస్టిక్ కారు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ స్క్రాచ్ 4 ఎపిసోడ్ మొత్తం కల్కి సినిమాపైనే అంచనాలను భారీగా పెంచేసింది. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ తాజా ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది అనే విషయం అర్థమవుతోంది.

ఈ బుజ్జికి సంబంధించి.. అది ఒక రోబో. కానీ, దాని బాడీని కోల్పోతుంది. అందుకే దానిని ఒక సూపర్ కారుకు అటాచ్ చేస్తారు. అంటే ట్రాన్సాఫ్మర్స్ లో రేంజ్ లో బుజ్జి ఒక పెద్ద రోబోలాగా మారిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రోబో హెడ్ ని తీసుకెళ్లి కారుకు తగిలిస్తున్నారు. పైగా తన బాడీని ఈ హెడ్ ద్వారానే కంట్రోల్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తే.. హాలీవుడ్ ట్రాన్సాఫ్మర్స్ లో తరహాలో ఒక సీక్వెన్స్ ప్లాన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే బుజ్జిని పూర్తిగా చూపించలేదు. మే 22న ఒక ఈవెంట్ పెట్టి రివీల్ చేస్తారని చెప్తున్నారు. మరి.. మీకు ఈ బుజ్జి ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişjojobet girişJOJOBET GİRİŞholiganbetjojobetjojobet girişgamdomgrandpashabet