iDreamPost

కల్కి 2898 AD బిజినెస్‌పై భారీ బజ్

  • Published Feb 27, 2024 | 4:36 PMUpdated Feb 27, 2024 | 4:36 PM

గత ఏడాది సలార్ మూవీతో అలరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఏడాది మేలో కల్కి సినిమాతో రాబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్, తారాగణంతో రాబోతున్న ఈ మూవీపై ఓ భారీ బజ్ నడుస్తోంది.

గత ఏడాది సలార్ మూవీతో అలరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఏడాది మేలో కల్కి సినిమాతో రాబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్, తారాగణంతో రాబోతున్న ఈ మూవీపై ఓ భారీ బజ్ నడుస్తోంది.

  • Published Feb 27, 2024 | 4:36 PMUpdated Feb 27, 2024 | 4:36 PM
కల్కి 2898 AD బిజినెస్‌పై భారీ బజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD ఈ ఏడాది ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో ఒక్కటి. ఎన్నో ఏళ్లుగా షూటింగ్ దశలో ఉన్న బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అంత క్రేజ్ ఉన్న సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం సహజమే కదా. అయితే ఇప్పటికీ అధికారికంగా చిత్ర నిర్మాతలు బిజినెస్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. అయితే ట్రేడ్ వర్గాల్లో వస్తున్న వార్తల ప్రకారం కల్కి సినిమా కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే 500 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయట.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. గత డిసెంబర్ లో విడుదలైన సలార్ తో సూపర్ డూపర్ హిట్ సాధించారు ప్రభాస్. దీంతో కల్కి 2898 AD సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కుల విషయంలో రాజమౌళి – రామ్ చరణ్ – ఎన్టీఆర్ ల గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేయనున్నట్లు ట్రేడ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైనే బిజినెస్ జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఆ రకంగా చూసుకుంటే కల్కి 2898 AD వరల్డ్ వైడ్ బిజినెస్ 500 కోట్ల వరకూ జరగవచ్చు. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ సినిమా మహాభారతం నుంచి మొదలవుతుందని చెప్పడంతో సినిమాకు మరింత హైప్ చేకూరింది. ఇక భారీ బిజినెస్ కు తగ్గట్లే కల్కి 2898 AD సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా మొదటి పది రోజుల్లో పెంచుతారు. మరి ఆ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల కల్కి 2898 AD సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి