iDreamPost

జగన్ సంకల్పానికి నిదర్శనం..జువ్వలదిన్నె ఫిషింగ్ హార్పర్..ప్రారంభానికి రెడీ!

రాష్ట్రంలోని మత్స్యకారులంతా సుదీర్ఘ కాలంగా కలలు కంటున్న ఫిషింగ్‌ హార్బర్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో కాగితాలకే పరిమితమైనవి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పంతో వాస్తవ రూపం దాలుస్తున్నాయి.

రాష్ట్రంలోని మత్స్యకారులంతా సుదీర్ఘ కాలంగా కలలు కంటున్న ఫిషింగ్‌ హార్బర్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో కాగితాలకే పరిమితమైనవి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పంతో వాస్తవ రూపం దాలుస్తున్నాయి.

జగన్ సంకల్పానికి నిదర్శనం..జువ్వలదిన్నె ఫిషింగ్ హార్పర్..ప్రారంభానికి రెడీ!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో  అన్ని వర్గాల ప్రజల సమస్యలను  ప్రత్యక్షంగా చూశారు. అలానే మత్స్యకారుల ఇబ్బందులను కూడా సీఎం జగన్ చూశారు. వారి కష్టాలను దూరం చేయాలని సీఎం జగన్ భావించారు. అందుకే అధికారంలోకి రాగానే  దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒకేసారి తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. వాటిల్లో ఒకటే  నెల్లూరు జిల్లాలోని జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంకల్పంతో ఈ హార్బర్ నిర్మాణం పూర్తై.. ప్రారంభానికి సిద్ధమైంది.

రాష్ట్రంలోని మత్స్యకారులంతా సుదీర్ఘ కాలంగా కలలు కంటున్న ఫిషింగ్‌ హార్బర్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పంతో అందుబాటులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం కాలంలో కాగితాలకే పరిమితమైనవి.. సీఎం జగన్ అధికారంలోకి రాగానే వాస్తవ రూపం దాలుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఒకేసారి తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో తొలి దశలో చేపట్టిన జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిల్లో కూడా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిపింగ్ హార్బర్ పనులు పూర్తై..ప్రారంభానికి సిద్ధమైంది.

ఇటీవలే చేపలు వేలం వేసుకోవడానికి హాలు, కోల్డ్‌ స్టోరేజ్, అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం వంటి భవనాల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. జువ్వలదిన్నె హర్బర్ ను రూ.288.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ హార్బర్‌ నిర్మాణం ప్రారంభమైతే.. 1,250 బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటుంది. తద్వారా 6,100 మంది మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూరనుంది.  జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏటా 41250 మెట్రిక్ టన్నుల చేపల క్యాచ్‌ను నిర్వహించడానికి అనుగుణంగా రూపొందించబడింది. ఈ హార్బర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. మత్స్య వాణిజ్యం మరియు ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడం, పుష్కలంగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా సీఎం జగన్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా రూ.3,520.56 కోట్లతో  రాష్ట్ర వ్యాప్తంగా 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నారు.

ఇదే సమయంలో జువ్వల దిన్నె హర్బర్ వద్ద మత్స్యకారులకు అదనపు ఆదాయం తీసుకొచ్చేలా ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు కింద నెల్లూరి జిల్లాలోని జువ్వలదిన్నె వద్ద 50 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. చాలా హర్బర్ల పనులు వేగంగా జరగుతుండగా.. త్వరలో జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నానికి సిద్ధంగా ఉంది. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్‌ హర్బర్‌ లేదా ఓడరేవు ఉండేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇలా మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కోసం పాటు పడుతునే రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో బృహత్తర ప్రాజెక్టలకు శ్రీకారం చుట్టారు. ఇది సీఎం జగన్ పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి