iDreamPost

విడాకులు తీసుకున్న ప్రధాని దంపతులు.. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

  • Author singhj Published - 09:13 AM, Thu - 3 August 23
  • Author singhj Published - 09:13 AM, Thu - 3 August 23
విడాకులు తీసుకున్న ప్రధాని దంపతులు.. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఈమధ్య కాలంలో విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇది చాలా కామన్ అయిపోయింది. ఎంతో గ్రాండ్​గా పెళ్లిళ్లు చేసుకునే సెలబ్రిటీలు.. తమ డివోర్స్ విషయాన్ని మాత్రం సింపుల్​గా ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పేస్తున్నారు. కొందరు ప్రముఖులైతే వివాహమైన ఐదారు నెలలకే తమ జీవిత భాగస్వామితో విడిపోవడాన్ని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఏళ్ల కొద్దీ అద్భుతమైన వైవాహిక జీవితాన్ని గడిపిన వారు కూడా విడాకులు తీసుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఇప్పుడో దేశ ప్రధాని కూడా ఇదే బాటలో నడిచారు.

కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. సుమారు 18 ఏళ్ల తమ పెళ్లి బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వాళ్లు ప్రకటించారు. చాలా కాలం పాటు చర్చించిన తర్వాతే ఈ కఠిన నిర్ణయానికి వచ్చామని ట్రూడో, ఆయన భార్య సోఫీ గ్రెగరీ ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్ ద్వారా తెలిపారు. వీళ్లిద్దరూ ఇప్పటికే విడాకులకు సంబంధించిన చట్టపరమైన అంగీకర పత్రంపై సంతకాలు చేశారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. జస్టిన్ ట్రూడో-సోఫీ గ్రెగరీలు 2005లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

జస్టిన్ ట్రూడో-సోఫీ గ్రెగరీలకు మొత్తంగా ముగ్గురు సంతానం ఉన్నారు. అందులో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రధాని దంపతుల కుమారుల పేర్లు జేవియర్, హడ్రెయిన్ కాగా.. కుమార్తె పేరు ఎల్లా గ్రేస్. అధికారంలో ఉన్న సమయంలో డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన రెండో కెనడా ప్రధానిగా ట్రూడో నిలిచారు. ఇంతకుముందు పవర్​లో ఉండగా విడాకులు తీసుకున్నారు మాజీ ప్రధాని పియరీ ట్రూడో. ఈయన ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి కావడం గమనార్హం. కెనడాలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా పేరొందిన జస్టిన్ ట్రూడో.. తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్నారు. ఆయన 2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి