Somesekhar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ కేసు విషయంలో భారీ ఊరట లభించింది. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ కేసు విషయంలో భారీ ఊరట లభించింది. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే గోవాలో ఓ యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర.. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ కేసు విషయంలో భారీ ఊరట లభించింది. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో స్థలం కొనుగోలు చేసి నిర్మించిన జూనియర్ ఎన్టీఆర్ ఇంటిపై బ్యాంకు హక్కులకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో యంగ్ టైగర్ కు భారీ ఊరట లభించింది. ఆ ఇంటిపై బ్యాంకులకు హక్కు లు ఉంటాయంటూ డీఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆ పిటిషన్ ను తాజాగా విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఇరు పక్షాల వాదనలు విని, డీఆర్టీ ఆదేశాలను రద్దు చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాల వాదనలు మళ్లీ వినాలని డీఆర్టీని హైకోర్టు ఆదేశించింది. కాగా.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత నుంచి 2003 లోనే ఎన్టీఆర్ కోనుగోలు చేశాడు. కానీ 1996లోనే ఈ స్థలాన్ని తాకట్టు పెట్టి పలు బ్యాంకుల్లో రుణం తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ రుణం కట్టకపోవడంతో.. ఆ స్థలంపై హక్కులు తమవే అంటూ పలు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. ఈ విషయంలోనే యంగ్ టైగర్ కోర్టును ఆశ్రయించాడు.