iDreamPost

మరోసారి తారక్- త్రివిక్రమ్ కాంబో? ఈ గ్యాప్ లోనే..

Jr NTR- Trivikram Combo: ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. తారక్ లైనప్ లో పెద్ద మార్పులే రాబోతున్నాయి అంటున్నారు.

Jr NTR- Trivikram Combo: ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. తారక్ లైనప్ లో పెద్ద మార్పులే రాబోతున్నాయి అంటున్నారు.

మరోసారి తారక్- త్రివిక్రమ్ కాంబో? ఈ గ్యాప్ లోనే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. తారక్ రేంజ్ పెరగడమే కాదు.. ఆతనిపై బాధ్యత కూడా అలాగే పెరిగిపోయింది. అభిమానులు పెరగడం మాత్రమే కాకుండా.. తారక్ పై అంచనాలు కూడా అలాగే పెరిగిపోయాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ స్టార్ హీరో తన మూవీస్ లైనప్ ని ప్లాన్ చేసుకున్నాడు. కానీ, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వింతే ముంటుంది చెప్పండి? ఇప్పుడు అలాంటి అనుకోని సంఘటనలే జూనియర్ ఎన్టీఆర్ కు ఎదురయ్యాయి. అయితే ఆ డైలామా నుంచి తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ అందబోతోంది అని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తన లైనప్ మొత్తాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ, అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. రియాలిటీలో మాత్రం మొదటికే మోసం వస్తోంది. డేట్స్, షూట్స్, సెట్స్ అంటూ చాలానే ప్రణాళికలు వేసుకున్నారు. ఎన్టీఆర్ మూవీస్ లైనప్ ఇలా ఉంది. ముందు కొరటాల శివతో దేవర పార్ట్ 1 షూట్ చేయాలి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీని కంప్లీట్ చేయాలి. ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు.

ఎన్టీఆర్ ప్లానింగ్ కు తగినట్లుగానే కొన్ని రోజులు షూట్ కూడా జరిగింది. కానీ, సైఫ్ అలీఖాన్ కి జరిగిన ప్రమాదంతో దేవర సినిమా షూటింగ్ ఆలస్యం జరిగింది. ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలి అనుకున్న దేవర సినిమా.. అక్టోబర్ 10కి వెళ్లిపోయింది. సరే దేవర ఆలస్యం అవుతోంది కదా అని వార్ 2 షూటింగ్ లో పాల్గొందాని తారక్ అనుకున్నాడు. కానీ, హృతిక్ రోషన్ కి గాయం అవడంతో వార్ 2 షూటింగ్ కూడా ఆలస్యం అవుతోంది. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 చేద్దామనుకుంటే.. నీల్ మాత్రం ప్రస్తుతం సలార్ పార్ట్ 2 హడావుడిలో ఉన్నాడు. ఇటు దేవర షూటింగ్ చూస్తే ఇంకో నెల రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సెట్స్ లో పాల్గొంటాడు అనే విషయంపై ఇండస్ట్రీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం వచ్చిన గ్యాప్ ని సద్వినియోగం చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. తనకు అరవింద సమేత వీర రాఘవతో హిట్టు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అంటున్నారు. త్రివిక్రమ్ కూడా తర్వాతి ప్రాజెక్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి అనే డైలామాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇద్దరి కాంబో మరోసారి సెట్ అయితే సూపర్ ఉంటుంది అంటూ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ ఎప్పటి నుంచో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించాలని భావిస్తున్నాడు. కానీ, అది ఇంత వరకు సెట్ కాలేదు. అల్లు అర్జున్, మహేశ్ బాబు ఇద్దరూ పాన్ ఇండియా మూవీకి ప్రామిస్ చేసినా వారి డేట్స్ ఎప్పుడు దొరుకుతాయో చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ వార్తలు నిజం కావాలి అంటూ తెగ కోరుకుంటున్నారు. మరి.. జూనియర్ ఎన్టీఆర్ ఈ గ్యాప్ ని త్రివిక్రమ్ తో ఫిల్ చేస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి