iDreamPost

వార్ 2 కోసం ముంబై వెళ్లిన తారక్.. అక్కడ పార్టీలో జంటగా రణబీర్-అలియా లతో కలిసి

  • Published Apr 29, 2024 | 12:05 PMUpdated Apr 29, 2024 | 12:05 PM

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా వార్ 2 షూటింగ్ కోసం తారక్ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా వార్ 2 షూటింగ్ కోసం తారక్ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Apr 29, 2024 | 12:05 PMUpdated Apr 29, 2024 | 12:05 PM
వార్ 2 కోసం ముంబై వెళ్లిన తారక్..  అక్కడ పార్టీలో జంటగా రణబీర్-అలియా లతో కలిసి

ఓ వైపు దేవర చిత్రంతో బిజీగా ఉన్న తారక్.. మరో వైపు బాలీవుడ్ లో తన తొలి ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్ కోసం ఇటీవల ముంబై కు వెళ్లిన సంగతి తెలిసిందే. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్, తారక్ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. దేవర సినిమాపైన ప్రేక్షకులకు ఎన్ని ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయో.. ఇటు తారక్ నటిస్తున్న వార్ 2 చిత్రం మీద కూడా అలాంటి అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో ముంబై లో ఉన్న తారక్.. సతీసమేతంగా రణబీర్-అలియా భట్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్‌లను కలిశారు. వారంతా కలిసి ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లిన వీడియోస్.. ఫొటోస్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ముంబైలోని ఓ రెస్టారెంట్ లో మెరిసిన స్టార్స్ ను చూసేందుకు వారి వారి అభిమానులంతా క్యూ కట్టారు. వారిలో ఓ లేడీ ఫ్యాన్ ఈరోజు తన బర్త్ డే అని.. తారక్ తో సెల్ఫీ కావాలని కోరడంతో. . తారక్ ఆమెను పిలిచి మరీ సెల్ఫీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వీరంతా కలిసి బయటకు వస్తున్నా క్రమంలో కెమెరాలలో వారిని బంధించేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్, వీడియోస్ అన్నీ ఆ హోటల్ లో చిత్రీకరించినవే. దీనితో అభిమానులంతా ఖుషి అయిపోతూ.. వాటిని తెగ షేర్ చేసేస్తున్నారు. ఇక మరో వైపు తారక్ సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే వార్ 2 సినిమా కోసం.. తారక్ మొత్తం 60 రోజుల షెడ్యూల్ ను కేటాయించినట్లు సమాచారం. వార్ 1 మొదటి పార్ట్ కు మించి వార్ 2 ఉండబోతుందని ఇన్సైడ్ ఇండస్ట్రీ భారీగానే బజ్ నడుస్తోంది. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు ఎన్టీఆర్ పాత్ర ఏమై ఉంటుంది అనేది మాత్రం ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. పైగా ఈ సినిమాలో తన లుక్ ను రివీల్ చేయకుండా.. సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించకుండా ఉండేందుకు… ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నాడట.

ఇక దేవర సినిమా విషయానికొస్తే ఈ సినిమా మొదటి పార్ట్ ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుందన్న విషయాన్నీ.. ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఆ పనులను పూర్తి చేసుకుని.. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు కొరటాల శివ. ఇక ఇప్పటికే ఈ సినిమాలో మ్యూజిక్ అదిరిపోయిందంటూ.. విశ్వక్, సిద్ధూ లాంటి హీరోస్ బయటపెట్టిన సంగతి తెలిసందే. ఇక తారక్ ను స్క్రీన్ మీద చూసి చాలా రోజులు గడిచిపోయింది కాబట్టి.. తారక్ అభిమానులంతా దేవర రిలీజ్ డేట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి