iDreamPost

విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన CM జగన్ కు మంచి ఫలితమే వస్తుంది: JD

ఏపీ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి నిర్వహించారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి నిర్వహించారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన CM జగన్ కు మంచి ఫలితమే వస్తుంది: JD

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ జనరంజకమైన పాలనను అందిస్తూ దూసుకెళ్తున్నారు. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. కొన్ని సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జేడీ ఇప్పుడు స్వయంగా అతడే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయంటూ పొగిడారు. జేడీ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు గొంతులో వెలక్కాయ పడినట్లుగా అయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జేడీ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపేస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి నిర్వహించారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ పాలనపై, పథకాలపై ప్రశంసలు గుప్పించారు. గొప్ప కార్యక్రమాలు చేపడుతున్న సీఎం జగన్ ను ప్రశంసంల్లో ముంచెత్తారు జేడీ. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన నాయకుడు సీఎం జగన్ కు ఎప్పుడూ మంచి ఫలితమే వస్తుంది అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. మంచి చేసే నాయకుడికి ప్రజల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

నాడు నేడు ద్వారా నేను చదివిన స్కూల్ ను కూడా సీఎం జగన్ అభివృద్ధి చేశారన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కూడా రాగి జావ వంటి మంచి పోషాకాహార పదార్ధాలను పేద విద్యార్థులకు అందించడం అభినందనీయమని జేడీ అన్నారు. జనరల్ గా డాక్టర్ వద్దకు రోగి వెళ్తాడు కానీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైద్యులే రోగుల వద్దకు వెళ్తున్నారని వెల్లడించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా డాక్టర్లే ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని తగు పరీక్షలు చేయడం చాలా గొప్ప విషయమని జేడీ అన్నారు. ఆరోగ్య సమస్యలు తగ్గే వరకు ఆరు నెలలు ఫాలో అప్ చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప కార్యక్రమమనే చెప్పుకోవాలని జేడీ ఈ సందర్భంగా వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి