iDreamPost

‘జవాన్’ వసూళ్ల సునామీ.. ఇంతవరకు ఏ హీరోకూ సాధ్యం కానిరీతిలో..!

  • Author singhj Published - 11:10 AM, Mon - 11 September 23
  • Author singhj Published - 11:10 AM, Mon - 11 September 23
‘జవాన్’ వసూళ్ల సునామీ.. ఇంతవరకు ఏ హీరోకూ సాధ్యం కానిరీతిలో..!

బాలీవుడ్ ఫుల్​ఫామ్​లో ఉన్నప్పుడు కింగ్ ఖాన్ షారుక్ డల్​ స్టేజ్​ను ఫేస్ చేశాడు. వరుస పరాజయాలతో డీలాపడ్డాడీ స్టార్ హీరో. కానీ గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా పైకి లేచాడు. ఫ్లాపులు పడిన చోటే వరుస బ్లాక్​బస్టర్లతో బాక్సాఫీస్​ను షేక్ చేస్తున్నాడు. గత మూడ్నాలుగేళ్లుగా సౌత్ సినిమాల దాడితో బాలీవుడ్ కుదేలైంది. ఒకవైపు హిందీ సినిమాలను ప్రేక్షకులు ఆదరించకపోవడం, అదే టైమ్​లో సౌత్ డబ్బింగ్ మూవీస్ నార్త్​లో బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధించడంతో అంతా షాకయ్యారు. కానీ ఈ సమయంలో ఇండస్ట్రీకి తాను ఉన్నానంటూ దూసుకొచ్చాడు షారుక్ ఖాన్. ఆయన నటించిన ‘పఠాన్’ మూవీ ఈ ఏడాది ఆరంభంలో రిలీజై సూపర్​హిట్​గా నిలిచింది.

‘పఠాన్’ చిత్రం ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లతో షారుక్ సత్తా ఏంటో మరోమారు చాటింది. అయితే ‘పఠాన్’ తర్వాత బాలీవుడ్​లో మళ్లీ పెద్దగా హిట్స్ పడలేదు. ఒక్క ‘గద్దర్ 2’ మాత్రమే సూపర్​ హిట్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో హిందీ చిత్ర పరిశ్రమలో మళ్లీ జోష్ నింపేందుకు మరో మూవీతో వచ్చేశాడు షారుక్. అదే ‘జవాన్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఈ మూవీ కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా షాకవుతున్నారు. ఇది కదా కింగ్ ఖాన్ పవర్ అనే రేంజ్​లో ఈ ఫిల్మ్ వసూళ్లు ఉన్నాయి.

‘జవాన్’ కలెక్షన్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదు. ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్​లో చేరడం విశేషం. తొలి రోజు రూ.125 కోట్లు వసూలు చేసిన షారుక్ సినిమా.. రెండో రోజు రూ.109 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో రోజు రూ.140 కోట్లు, నాలుగో రోజు రూ.156 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. రూ.531 కోట్లకు పైనే ఉంది. ఈ ఏడాది మొదట్లో ‘పఠాన్’తో బాలీవుడ్​కు పున: వైభవం తీసుకొచ్చిన షారుక్.. మళ్లీ 7 నెలల గ్యాప్​లో ‘జవాన్​’తో మరో బ్లాక్​ బస్టర్​ను ఇండస్ట్రీకి అందించాడు.

వరుసగా ‘పఠాన్’, ‘జవాన్’ లాంటి సూపర్ హిట్స్​తో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తానే అసలైన బాద్​ షా అని షారుక్ నిరూపించుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకే ఏడాదిలో రెండు మూవీస్ రూ.500 కోట్ల క్లబ్​లో చేరడంతో షారుక్ అరుదైన రికార్డును సాధించారు. ఏ ఇండియన్ హీరో కూడా అందుకోని ఫీట్ ఇది కావడం విశేషం. బాక్సాఫీస్ వద్ద అల్టిమేట్ జాతర చేస్తున్న ‘జవాన్’ లాంగ్ రన్​లో రూ.1,000 కోట్ల మార్క్​ను పక్కాగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది షారుక్ నుంచి మరో మూవీ కూడా రానుంది. టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో కింగ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘డంకీ’ ఈ ఏడాది ఆఖర్లో విడుదల కానుంది. ఇది కూడా హిట్టయితే షారుక్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నట్లే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి