బాలీవుడ్ ఫుల్‌ఫామ్‌లో ఉన్నప్పుడు కింగ్ ఖాన్ షారుక్ డల్ స్టేజ్‌ను ఫేస్ చేశాడు. వరుస పరాజయాలతో డీలాపడ్డాడీ స్టార్ హీరో. కానీ గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా పైకి లేచాడు. ఫ్లాపులు పడిన చోటే వరుస బ్లాక్బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. గత మూడ్నాలుగేళ్లుగా సౌత్ సినిమాల దాడితో బాలీవుడ్ కుదేలైంది. ఒకవైపు హిందీ సినిమాలను ప్రేక్షకులు ఆదరించకపోవడం, అదే టైమ్‌లో సౌత్ డబ్బింగ్ మూవీస్ నార్త్‌లో బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధించడంతో అంతా షాకయ్యారు. కానీ ఈ సమయంలో ఇండస్ట్రీకి తాను ఉన్నానంటూ దూసుకొచ్చాడు షారుక్ ఖాన్. ఆయన నటించిన ‘పఠాన్’ మూవీ ఈ ఏడాది ఆరంభంలో రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచింది.
‘పఠాన్’ చిత్రం ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లతో షారుక్ సత్తా ఏంటో మరోమారు చాటింది. అయితే ‘పఠాన్’ తర్వాత బాలీవుడ్లో మళ్లీ పెద్దగా హిట్స్ పడలేదు. ఒక్క ‘గద్దర్ 2’ మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో హిందీ చిత్ర పరిశ్రమలో మళ్లీ జోష్ నింపేందుకు మరో మూవీతో వచ్చేశాడు షారుక్. అదే ‘జవాన్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఈ మూవీ కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా షాకవుతున్నారు. ఇది కదా కింగ్ ఖాన్ పవర్ అనే రేంజ్లో ఈ ఫిల్మ్ వసూళ్లు ఉన్నాయి.
‘జవాన్’ కలెక్షన్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదు. ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. తొలి రోజు రూ.125 కోట్లు వసూలు చేసిన షారుక్ సినిమా.. రెండో రోజు రూ.109 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో రోజు రూ.140 కోట్లు, నాలుగో రోజు రూ.156 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. రూ.531 కోట్లకు పైనే ఉంది. ఈ ఏడాది మొదట్లో ‘పఠాన్’తో బాలీవుడ్‌కు పున: వైభవం తీసుకొచ్చిన షారుక్.. మళ్లీ 7 నెలల గ్యాప్‌లో ‘జవాన్’తో మరో బ్లాక్ బస్టర్‌ను ఇండస్ట్రీకి అందించాడు.
వరుసగా ‘పఠాన్’, ‘జవాన్’ లాంటి సూపర్ హిట్స్‌తో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తానే అసలైన బాద్ షా అని షారుక్ నిరూపించుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకే ఏడాదిలో రెండు మూవీస్ రూ.500 కోట్ల క్లబ్లో చేరడంతో షారుక్ అరుదైన రికార్డును సాధించారు. ఏ ఇండియన్ హీరో కూడా అందుకోని ఫీట్ ఇది కావడం విశేషం. బాక్సాఫీస్ వద్ద అల్టిమేట్ జాతర చేస్తున్న ‘జవాన్’ లాంగ్ రన్లో రూ.1,000 కోట్ల మార్క్‌ను పక్కాగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది షారుక్ నుంచి మరో మూవీ కూడా రానుంది. టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో కింగ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘డంకీ’ ఈ ఏడాది ఆఖర్లో విడుదల కానుంది. ఇది కూడా హిట్టయితే షారుక్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నట్లే.
Jawan WW Box Office
The film joins the elite ₹500 cr club in just 4 days across the world.
Registers biggest single day collection in India for any Bollywood film till date.
||#Jawan|#ShahRukhKhan|#Nayanthara||
Day 1 – ₹ 125.05 cr
Day 2 – ₹ 109.24 cr
Day 3 – ₹ 140.17… pic.twitter.com/5GLg3Az7Qa— Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023