iDreamPost
android-app
ios-app

ట్రోలర్స్​కు ఇచ్చిపడేసిన బుమ్రా భార్య.. అలా అనడానికి సిగ్గుండాలంటూ..!

  • Published Feb 13, 2024 | 9:01 AM Updated Updated Feb 13, 2024 | 9:01 AM

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ అందరికీ సుపరిచితురాలే. బుమ్రా వైఫ్​గానే కాదు.. స్పోర్ట్స్ యాంకర్​గానూ ఆమెకు మంచి క్రేజ్ ఉంది.

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ అందరికీ సుపరిచితురాలే. బుమ్రా వైఫ్​గానే కాదు.. స్పోర్ట్స్ యాంకర్​గానూ ఆమెకు మంచి క్రేజ్ ఉంది.

  • Published Feb 13, 2024 | 9:01 AMUpdated Feb 13, 2024 | 9:01 AM
ట్రోలర్స్​కు ఇచ్చిపడేసిన బుమ్రా భార్య.. అలా అనడానికి సిగ్గుండాలంటూ..!

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. అతడి బౌలింగ్​ను ఎదుర్కోవాలంటేనే ప్రత్యర్థి బ్యాటర్లు గజగజలాడుతున్నారు. ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో అతడి బౌలింగ్​కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇండియన్ పిచెస్​పై ఓ పేస్ బౌలర్ ఇంతలా రెచ్చిపోయి బౌలింగ్ చేయడం మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు. స్పిన్, ఫ్లాట్ ట్రాక్స్​ మీదే బ్యాటర్లను వణికిస్తున్న బుమ్రా.. ఒకవేళ పేస్ ట్రాక్స్ వస్తే ఇంకెంత డేంజరస్​గా మారతాడోనని అంటున్నారు. ఇంగ్లండ్​ బజ్​బాల్​కు సరైన కౌంటర్ బూమ్​బాల్​ అని చెబుతున్నారు. ఈ తరుణంలో బుమ్రా భార్య సంజనా గణేషన్ కొందరు ట్రోలర్స్​పై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. ఆ మాటలు అనేందుకు సిగ్గుండాలంటూ ఆమె సీరియస్ అయింది.

అధిక బరువు అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో పాటు వారసత్వం వల్ల కూడా కొందరు ఓవర్​ వెయిట్​తో ఇబ్బంది పడుతున్నారు. అయితే పురుషుల సంగతి పక్కనబెడితే.. మహిళల్లో ముఖ్యంగా డెలివరీ తర్వాత స్త్రీలు కాస్త బరువు పెరగడం కామనే. అయితే కొందరు విమెన్​ను టార్గెట్ చేసుకొని బరువు ఎక్కువ ఉన్నారంటూ కామెంట్స్ చేస్తుంటారు. అందులోనూ క్రికెటర్లు, సినీ తారల విషయంలో ట్రోలింగ్ చాలా ఎక్కుగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు బుమ్రా భార్యను ట్రోల్ చేశారు. ఆమె లావెక్కిందంటూ కామెంట్ చేశారు. దీనికి సంజన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అలా మాట్లాడటానికి సిగ్గుండాలంటూ ఆమె సీరియస్ అయింది. స్కూలు సైన్స్ పుస్తకాల్లో ఏముందో గుర్తుండదని.. కానీ స్త్రీల శరీరాల గురించి కామెంట్ చేసేందుకు మాత్రం ముందుంటారంటూ ఫైర్ అయింది.

ట్రోలర్స్​పై విరుచుకుపడిన బుమ్రా భార్యను సోషల్ మీడియాలో నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదంటున్నారు. ఇతరుల గురించి మాట్లాడేవారు.. ముందు వాళ్ల లైఫ్, కెరీర్​ గురించి చూసుకుంటే బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, సమస్యలు ఉంటాయని.. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారి మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసే హక్కు ఉందనుకోవడం సరికాదంటున్నారు. ట్రోలర్స్​కు సంజనా కరెక్ట్ కౌంటర్ ఇచ్చిందని.. ఇది ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోందని చెబుతున్నారు. ఇక, ఈ విషయాన్ని అటుంచితే.. భారత జట్టు రాజ్​కోట్​ టెస్టుకు రెడీ అవుతోంది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచులో నెగ్గి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తోంది. మరి.. ట్రోలర్స్​కు బుమ్రా భార్య ఇచ్చిపడేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్​కు టీమిండియా స్టార్ గుడ్​బై.. మరో ధోని అవుతాడనుకుంటే..!

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş