iDreamPost

Jasprit Bumrah: వారికి అహం ఉంటే కష్టమే.. బుమ్రా కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి!

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడా? అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడా? అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Jasprit Bumrah: వారికి అహం ఉంటే కష్టమే.. బుమ్రా కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్ లో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను కూల్చాడు ఈ స్పీడ్ స్టర్. యార్కర్ల కింగ్ గా వరల్డ్ క్రికెట్ లో తనదైన ముద్రవేసుకున్నాడు. ఇక ఆర్సీబీపై సంచలన ప్రదర్శన చేసిన తర్వాత బుమ్రా పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. బౌలర్లకు అహం ఉంటే కష్టమని సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినట్లు అని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జస్ప్రీత్ బుమ్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. బౌలర్లకు అహం ఉండకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా మాట్లాడుతూ..”టీ20 ఫార్మాట్లో బౌలర్లకు అహం ఉండకూడదు. ఇక ప్రతీసారి బ్యాటర్లకు యార్కర్ వేయాల్సిన అవసరం లేదు. కొన్నికొన్ని సార్లు బౌన్సర్లు, స్లో బాల్స్ కూడా వేయాల్సి ఉంటుంది. టీ20ల్లో బౌలర్లుకు చాలా కష్టం. అందుకే ఎప్పుడూ ఒకే వ్యూహంతో వెళ్తానంటే పనవ్వదు. పరిస్థితులను బట్టి వ్యూహాలను మార్చాలి. దీనికోసం నేను కెరీర్ మెుదట్లోనే కసరత్తు చేశాను” అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

అయితే బుమ్రా చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడు? టీమిండియా బౌలర్లనేనా? లేక యంగ్ బౌలర్లనా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బౌలర్లు సహనం కోల్పోయి బ్యాటర్లపైకి మరింత స్పీడ్ గా బంతులు సంధిద్ధామని అనుకుంటారు. కానీ ఇది తప్పు అన్న ఉద్దేశంలో బుమ్రా ఈ కామెంట్స్ చేశాడని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. గంటకు 145-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసే సామర్థ్యం ఉండొచ్చు.. కానీ కొన్నిసార్లు స్లో బాల్స్ వేయడమే గొప్ప అని ఈ యార్కర్ల కింగ్ చెప్పుకొచ్చాడు. మరి బుమ్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి