iDreamPost

Rohit Sharma: కోహ్లీని డామినేట్ చేస్తూ.. IPL కింగ్​గా రోహిత్! ఈ క్రేజ్ ఆల్​టైమ్ రికార్డ్!

  • Published Apr 13, 2024 | 1:13 PMUpdated Apr 13, 2024 | 1:13 PM

ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్​టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీని డామినేట్ చేస్తూ ఐపీఎల్​ నయా కింగ్​గా అవతరించాడు హిట్​మ్యాన్.

ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్​టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీని డామినేట్ చేస్తూ ఐపీఎల్​ నయా కింగ్​గా అవతరించాడు హిట్​మ్యాన్.

  • Published Apr 13, 2024 | 1:13 PMUpdated Apr 13, 2024 | 1:13 PM
Rohit Sharma: కోహ్లీని డామినేట్ చేస్తూ.. IPL కింగ్​గా రోహిత్! ఈ క్రేజ్ ఆల్​టైమ్ రికార్డ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే చాలు.. అందరికీ ఠక్కున మూడు పేర్లు గుర్తుకొస్తాయి. అవే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని. స్టార్టింగ్ సీజన్ నుంచి ఈ త్రిమూర్తులు ఐపీఎల్​లో ఆడుతూ వస్తున్నారు. ఒక్క కోహ్లీ తప్ప మిగతా ఇద్దరూ పలుమార్లు క్యాష్ రిచ్ లీగ్ టైటిల్​ను సొంతం చేసుకున్నారు. అయితే కప్పు కొట్టకున్నా క్రేజ్​లో మాత్రం మిగతా ఇద్దరి కంటే విరాట్​ చాలా ముందున్నాడు. అతడి కోసమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచులు చూసే అభిమానులు లక్షలాది మంది ఉన్నారు. ఆర్సీబీకి ఆ రేంజ్​లో ఫ్యాన్​బేస్ ఉందంటే అదంతా కోహ్లీ చలవే. బెంగళూరుకే కాదు.. ఐపీఎల్​కే పోస్టర్​గా బాయ్​గా, మెయిన్ ఫేస్​గా ఉన్నాడు విరాట్. అయితే ఈ సీజన్​లో అది మారింది. కోహ్లీని డామినేట్ చేస్తూ ఐపీఎల్ నయా కింగ్​గా రోహిత్ శర్మ అవతరించాడు.

ఐపీఎల్​లో రోహిత్ ఆల్​టైమ్ రికార్డు సృష్టించాడు. మ్యాచ్ జరిగే సమయంలో గ్రౌండ్​లోకి స్టార్ క్రికెటర్లు ఎంట్రీ ఇచ్చినప్పుడు, వికెట్లు తీసినప్పుడు, భారీ షాట్స్ బాదినప్పుడు స్టేడియంలోని ఆడియెన్స్ సందడి చేయడం తెలిసిందే. గట్టిగా అరుస్తూ, విజిల్స్ వేస్తూ, అభిమాన క్రికెటర్ల పేర్లతో నినాదాలు చేస్తూ ఆ టైమ్​లో ఫ్యాన్స్ చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఇలా అభిమానుల సందడి సమయంలో వచ్చే శబ్దాన్ని ఐపీఎల్​లో రికార్డు చేస్తున్నారు. ఏ ప్లేయర్​కు ఎంత డెసిబల్స్​లో రెస్పాన్స్ లభిస్తుందనే దాని ప్రకారం లౌడెస్ట్ చీర్ నంబర్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు వరకు ధోని, కోహ్లీ ఈ లిస్ట్​లో టాప్​లో ఉండేవారు. కానీ వాళ్లిద్దర్నీ హిట్​మ్యాన్ అధిగమించాడు.

వాంఖడే మైదానం వేదికగా ముంబై-ఆర్సీబీకి మధ్య జరిగిన మ్యాచ్​లో రోహిత్ బ్యాటింగ్ టైమ్​లో స్టేడియం దద్దరిల్లింది. అతడు సెకండ్ సిక్స్ కొట్టిన సమయంలో గ్రౌండ్​లో ఏకంగా 129 డెసిబల్స్ నాయిస్ రికార్డ్ అయింది. దీంతో లౌడెస్ట్ చీర్ లిస్ట్​లో రోహిత్ టాప్ ప్లేస్​ను దక్కించుకొని అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో ధోని (128 డెసిబల్స్-సీఎస్​కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్), విరాట్ కోహ్లీ (126 డెసిబల్స్-ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ రికార్డు గురించి తెలిసిన అభిమానులు రోహిత్​ను ఐపీఎల్ నయా కింగ్​గా అభివర్ణిస్తున్నారు. హిట్​మ్యాన్​ క్రేజ్​కు ఇది నిలువుటద్దం అని మెచ్చుకుంటున్నారు. రోహిత్ ఇలాగే రఫ్ఫాడిస్తూ పోవాలని.. ఈ ఏడాది ముంబైకి మరో కప్ అందించాలని ఆ టీమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి.. రోహిత్ ఆల్​టైమ్ రికార్డ్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి