iDreamPost
android-app
ios-app

హార్దిక్ కాదు.. కెప్టెన్సీలో రోహిత్​ వారసుడు అతడే: మాజీ క్రికెటర్

  • Published Jun 17, 2024 | 9:20 PM Updated Updated Jun 17, 2024 | 9:20 PM

టీమిండియాను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. గత వన్డే వరల్డ్ కప్​లో జట్టును ఫైనల్స్​కు చేర్చిన హిట్​మ్యాన్.. పొట్టి కప్పులోనూ టీమ్​ను సమర్థంగా నడిపిస్తున్నాడు.

టీమిండియాను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. గత వన్డే వరల్డ్ కప్​లో జట్టును ఫైనల్స్​కు చేర్చిన హిట్​మ్యాన్.. పొట్టి కప్పులోనూ టీమ్​ను సమర్థంగా నడిపిస్తున్నాడు.

  • Published Jun 17, 2024 | 9:20 PMUpdated Jun 17, 2024 | 9:20 PM
హార్దిక్ కాదు.. కెప్టెన్సీలో రోహిత్​ వారసుడు అతడే: మాజీ క్రికెటర్

టీమిండియాను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. గత వన్డే వరల్డ్ కప్​లో జట్టును ఫైనల్స్​కు చేర్చిన హిట్​మ్యాన్.. పొట్టి కప్పులోనూ టీమ్​ను సమర్థంగా నడిపిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్-2024లో సూపర్-8 దశకు చేరుకుంది భారత్. తదుపరి ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి బలమైన జట్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ మూడు టీమ్స్​ను మట్టికరిపించేందుకు రోహిత్ అవసరమైన ప్లాన్స్ వేస్తున్నాడు. కరీబియన్ పిచ్​లకు తగ్గట్లు అందుబాటులో ఉన్న ఆప్షన్స్​లో మంచి టీమ్​ కాంబినేషన్​తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్ మిస్సైంది కాబట్టి.. ఎలాగైనా పొట్టి కప్పును సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు హిట్​మ్యాన్. అందుకే ఎదురొచ్చిన టీమ్స్​ను తొక్కుకుంటూ పోవాలని ఫిక్స్ అయ్యాడు.

ఇక, టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్​కు రోహిత్ గుడ్​బై చెబుతాడని వినిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డే ఫార్మాట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకొని కేవలం టెస్టులకే పరిమితమయ్యే ఆలోచనల్లో హిట్​మ్యాన్​ ఉన్నట్లు సమాచారం. దీంతో అతడి వారసుడిగా ఎవర్ని కెప్టెన్​గా ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఆ రోల్ కోసం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్​ పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీలో రోహిత్ వారసుడిగా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రానే కరెక్ట్ అని అన్నాడు. అతడ్ని మించిన ఆప్షన్ లేదన్నాడు.

‘సారథ్యంలో రోహిత్​కు సరైన వారసుడు ఎవరంటే బుమ్రా పేరే చెబుతా. మూడు ఫార్మాట్లలోనూ జట్టును సమర్థంగా ముందుండి నడిపించే సత్తా అతడికి ఉంది. బుమ్రాలో లీడర్​షిప్ స్కిల్స్ మెండుగా ఉన్నాయి. ఎంత ఒత్తిడిలోనూ సంయమనం కోల్పోకుండా కూల్​గా ఉండగలడు. టీ20లు, వన్డేలు, టెస్టులకు డిఫరెంట్ కెప్టెన్స్ కావాలంటే అలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. కానీ రోహిత్ మాదిరిగా అన్ని ఫార్మాట్లకు ఒకే వ్యక్తి సారథిగా ఉండాలంటే బుమ్రాకే ఆ బాధ్యతలు అప్పగించాలి. ఎందుకంటే అన్ని ఫార్మాట్లలోనూ అతడు జట్టులో రెగ్యులర్ ప్లేయర్. టీమ్​లో అతడు ఎంతో కీలకం. జట్టును కెప్టెన్​గా నడిపించే సామర్థ్యం, అనుభవం అతడికి ఉన్నాయి’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. రోహిత్ తర్వాత బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అంటూనే.. ఒక ప్లేయర్ క్యాలెండర్ ఇయర్​లోని అన్ని గేమ్స్ ఆడటం సాధ్యం కాదన్నాడు. మరి.. రోహిత్​కు సరైన వారసుడు బుమ్రానే అంటూ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)