iDreamPost
android-app
ios-app

నేను తరచూ తిరుపతికి రావడానికి కారణం అదే: జాన్వీ కపూర్

Janhvi Kapoor, Tirumala: బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ తరచు తిరుమల వెళ్లే విషయం మనందరికి తెలిసిందే. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. తాను తరచూ తిరుమలకు వెళ్లడానికి గల కారణాలను జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Janhvi Kapoor, Tirumala: బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ తరచు తిరుమల వెళ్లే విషయం మనందరికి తెలిసిందే. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. తాను తరచూ తిరుమలకు వెళ్లడానికి గల కారణాలను జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నేను తరచూ తిరుపతికి రావడానికి కారణం అదే:  జాన్వీ కపూర్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. పలు సినిమాల్లో నటించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇక అందాలను ఆరబోయడంలో ఎక్కడ తగ్గదు ఈ అమ్మడు. ఇలా హాట్ లుక్స్ తో కనిపించే.. జాన్వీలో మరో కోణం కూడా ఉంది. అదే ఆధ్యాత్మిక చింతన. తరచూ ఈ అమ్మడు తిరుమలకు వెళ్తుంటుంది. తాజాగా తాను ఎందుకు ఎక్కువ సార్లు తిరుమలకు వెళ్తానో చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు విషయాల గురించి షేర్ చేసుకుంది. ఇక  ఆవివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ తరచు తిరుమల వెళ్లే విషయం మనందరికి తెలిసిందే. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. లంగావోణిలో తాను సినిమాల్లో ఉండేదానికి భిన్నంగా జాన్వీ కనిపిస్తుంటుంది. ఇక ఈ అమ్మడు తరచూ తిరుమలకు వెళ్తుండటంపై  చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. సినిమాల్లో అంతలా రెచ్చిపోయే జాన్వీలో ఆధ్యాత్మిక చింతన  కనిపించడం చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అయితే తాను తరచూ తిరుమలకు వెళ్లడానికి గల కారణాలను జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.

తన తల్లి కొన్ని విషయాలను బాగా విశ్వసించేదని, ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పనులు చేయడానికి అంగీకరించేది కాదని తెలిపింది. అలాగే శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని, అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని తన తల్లి చెప్పేదని ఈ బ్యూటీ తెలిపింది. శుక్రవారం నల్ల దుస్తులను అసలు వేసుకోనిచ్చేది కాదని, ఆమె బతికి ఉన్నప్పుడు ఇలాంటి వాటిని పట్టించుకోలేదని వెల్లడించింది. కానీ తన తల్లి దూరమయ్యాక వీటిని నమ్మడం మొదలుపెట్టానని తెలిపింది.

ప్రస్తుతం శ్రీదేవి  కంటే జాన్వీనే ఎక్కువగా ఆ నమ్మకాలను విశ్వసిస్తున్నారట. అమ్మ బతికున్నప్పుడు ప్రతి ఏడాది పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేదని తెలిపింది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి తాను  ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను తెలిపింది. అమ్మ లేకుండా తొలిసారి తిరుమల వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానని జాన్వీ తెలిపింది. తిరుమలకు వెళ్తే..ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుందని, అందుకే తరచు వెళ్తుంటానని తెలిపింది.

ప్రస్తుతం జాన్వీ కపూర్  ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’  సినిమాలో నటించింది. ఈ సినిమా మే 31న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో జాన్వీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో  మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. అపూర్వ మోహతా, కరణ్‌జోహార్‌ మూవీని సంయుక్తంగా నిర్మించారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş