iDreamPost

ప్రేమ పెళ్లికి రెడీ అయినా ‘జై భీమ్’ హీరోయిన్! అబ్బాయి ఎవరంటే..

Rajish Vijayan: ఈ మధ్యకాలంలో చాలా మంది యంగ్ హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో జై భీమ్ మూవీ హీరోయిన్ చేరనున్నారు. ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

Rajish Vijayan: ఈ మధ్యకాలంలో చాలా మంది యంగ్ హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో జై భీమ్ మూవీ హీరోయిన్ చేరనున్నారు. ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

ప్రేమ పెళ్లికి రెడీ అయినా ‘జై భీమ్’ హీరోయిన్! అబ్బాయి ఎవరంటే..

ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్లు వరుసగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. పలానా ఇండస్ట్రీ అని లేకుండా చాలా మంది పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇది ఇలా ఉంటే  కొందరు సెలబ్రిటీలపై అనేక వార్తలు వస్తుంటాయి. వారు త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు, వారి కాబోయే భాగస్వామి వీరే అన్నట్లు వార్తలు వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజం ఉండగా, మరికొన్ని మాత్రం కేవలం పుకార్లే ఉంటాయి. ఏది ఏమైనా తాజాగా మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. జై భీమ్ లో నటించిన హీరోయిన్ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు ఇండస్ట్రీలో టాక్. మరి.. ఆమె ఎవరు, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఈ మధ్యకాలంలో చాలా మంది యంగ్ హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మన టాలీవుడ్ అమ్మాయిలు తక్కువే కానీ ఇతర ఇండస్ట్రీలకు చెందిన వారు మాత్రం పెళ్లి చేసుకుని భోజనం పెట్టేస్తున్నారు. ఇక వారి జాబితాలోకి మరో హీరోయిన్ చేరింది. అచ్చం తెలుగమ్మాయిలాగానే కనిపించే రజిషా విజయన్ నే త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో కర్ణన్ సినిమాలో నటించింది. అలానే సూపర్ హిట్ గా నిలిచిన, సూర్య నటించిన జై భీమ్ సినిమాలో కూడా హీరోయిన్ నటించింది. ఈ సినిమాలో రజిషా తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. అలానే సర్దార్ సినిమాలో కూడా నటించి అభిమానుల దృష్టిని ఆకర్షించింది నటి రజిషా విజయన్.

2021లో కర్ణన్ సినిమాతో ఈ అమ్మడు కోలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనస్సును గెల్చింది. కోలివుడ్  ఇండస్ట్రీలోకి రాకముందు మలయాళంలో వెండితెర, బుల్లితెరలపై మెరిసింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. త్వరలో కొత్త బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు  సమాచారం.  నటి రజిషా విజయన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఈ ఇద్దరూ జంటగా దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ జోడీ వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇక ఈ అమ్మడు మాస్ మహారాజా రవితేజకు  జోడీగా రామరావు ఆన్ డ్యూటీ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ప్రస్తుతం తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ  ఈ బ్యూటీ బిజీగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించలేదు. అయినాన ఆ మధ్య ఇటీవలే వారిద్దరు కలిసి చేసిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతుందని పలువురు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి