iDreamPost

ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా – తెలుగుదేశం నేత కోండ్రు మురళి

ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా – తెలుగుదేశం నేత కోండ్రు మురళి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సౌత్ ఆఫ్రికా మోడల్లో 3 రాజధానులు ఉంటే తప్పేంటి అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చెసిన ప్రకటనతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజధానిపై చర్చ ప్రారంభం అయింది. విశాలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూల్ లో జ్యుడిషియల్ క్యాపిటల్ రావచ్చేమో అని జగన్ చేసిన ప్రకటనతో అటు రాయలసీమ ప్రజలు ఇటు ఉత్తరాంద్ర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా , అమరావతి ప్రాంతంలో మాత్రం భిన స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టగా , లోక్ సత్తా జైప్రకాష్ నారాయణ మాత్రం స్వాగతించారు.

ఇదిలా ఉంటే తెలుగుదేశంలో ముఖ్యనేతగా ఉన్న కోండ్రు మురళి రాజధాని ప్రకటనపై ఆసక్తికర వాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తానంటే తప్పేంటని, కొంతమంది రైతులకోసం తెలుగుదేశం నాయకులు మాట్లాడటం సరికాదని , ముఖ్యమంత్రి నిర్ణయన్ని పార్టీలకు ఆతీతంగా స్వాగతించాలని, ఎంతో కాలంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ది చెందే అవకాశం ఉందని దీనికి అడ్డుపడటం సరైన పని కాదని చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో తెలుగుదేశం నేతల్లోనే చీలిక రావటం అధినేత చంద్రబాబుకి ఒకింత ఇబ్బంది పెట్టే విషయమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి